Funds Delay: స్వేచ్ఛ బ్యూరో: రైతు కమిషన్ కు నిధుల విడుదల అడ్డంకిగా మారింది. రైతులతో సమావేశాలు, సదస్సులు నిర్వహించాలన్న నిధులు తప్పని సరి. అయితే కమిషన్ అధికారులు మాత్రం ప్రొవిజన్ లేదనే సాకుతో విడుదల చేయడం లేదని సమాచారం. ఏ పని ముందుకు సాగకపోవడంతో రైతు కమిషన్ సభ్యులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరుతో గతేడాది కేటాయించిన నిధుల్లో సుమారు 7 కోట్లు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ఆ నిధులు విడుదలైతే కమిషన్ మరిన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, గత ప్రభుత్వం రైతాంగంపై అనుసరించిన నిర్లక్ష్యానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి పరిష్కారానికి చొరవ చూపి వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు కమిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ దూకుడుకు అధికారులు కళ్లెం వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏదైనా రైతుకు సంబంధించిన సమావేశం నిర్వహించాలన్నా.. పంటల సాగు, వాణిజ్య పంటలపై అవగాహన సదస్సులు, భూసారం, పంటనష్టాలపై అవగాహన సదస్సులు ఇలా ఏది ఏర్పాటు చేయాలన్నా రైతు కమిషన్ కు నిధుల అడ్డంకిగా మారింది. ఫలానా రోజూ సమావేశం నిర్వహిస్తున్నామని అందుకు ఖర్చులు ఇవ్వాలని రైతు కమిషన్ లో పనిచేస్తున్న అధికారులకు సూచిస్తే వారు మాత్రం నిధుల విడుదలకు ప్రొవిజన్ లేదని చెప్పుతున్నట్లు సమాచారం. దీంతో కమిషన్ చేపట్టే కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గతేడాది 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతు కమిషన్ కు 8.5 కోట్లు కేటాయించారు. ఇందులో.1.5కోట్లు మాత్రమే అధికారులు, సిబ్బంది జీత భత్యాలు మాత్రమే వినియోగించినట్లు సమాచారం. మిగిలిన రూ.7 కోట్లు వాస్ వెళ్లినట్లు సమాచారం. కేటాయించిన నిధులు విడుదల చేయకుండా.. రైతు కమిషన్ కార్యక్రమాలు నిర్వహించకుండా అధికారులే అడ్డుపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది (2026-27)లో సైతం రూ.10కోట్లు కేటాయించారు. అయితే ఈ నిధులు కూడా గతేడాది మాదిరిగానే కాగితాలపైనే కేటాయింపులు.. ఆ తర్వాత వెనక్కి అన్న చందంగా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
Also read: గాంధీ భవన్‌కు కీలక నేతల రామ్ రామ్..?
మరో వైపు రైతుకమిషన్ లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పరిధిలోని సుమారు 25 నుంచి 30మంది పనిచేస్తున్నారు. అయితే వారికి రైతు కమిషన్ కు కేటాయించిన నిధుల నుంచి కేటాయించాల్సి ఉంటుంది. కానీ అధికారులు మాత్రం చోద్యం కారణంగా గత ఆరేడు నెలలుగా చెల్లించడం లేదని సమాచారం. దీంతో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పరిధిలోని పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమిషన్ దృష్టికి సైతం ఈ విషయం తీసుకెళ్లినట్లు సమాచారం. కమిషన్ నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లినప్పటికీ వేతనాలు విడుదలలో మాత్రం జాప్యం జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. కావాలనే అడ్డుపడుతున్నారనే ప్రచారం జరుగుతుంది.
రైతు కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి యాక్టీవ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ములుగు, సూర్యాపేట, గద్వేల్ విత్తనోత్పత్తి రైతులకు న్యాయం చేసేలా చేసిన కమిషన్ కృషిచేసింది. నష్టపరిహారం ఇప్పించేలా కృషిచేసింది. అంతేకాదు విష పారాక్వాట్ నిషేదించడంలో కీలకపాత్ర పోషించింది. గిరిజన రైతులకు పంటరుణాలు కల్పించేలా, మని లెండ్డింగ్ చట్టం అమలయ్యేలా చేసింది, విత్తన చట్టం తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. అదే విధంగాగ్రామాల్లో చెరువులు భద్రంగా ఉండాలంటే నీటిసంఘాల ఏర్పాటు చేయాలని సూచన చేసింది. వ్యవసాయ మార్కెట్ లో దళారులు లేకుండా చూడాలని, కనీస వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు రైతులు ఎదుర్కొంటున్న ప్రతి అంశంపై కమిషన్ స్పందిస్తూ పరిష్కారానికి కృషిచేస్తుంది. రైతులకు అందిస్తున్న కమిషన్ సేవలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కమిషన్ లో పనిచేసే కొంతమంది అధికారులు.. వ్యవసాయశాఖ కు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాలను పటిస్తుండటంతోనే నిధుల విడుదలకు ప్రొవిజన్ లేదని అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Aldo Read: Congress : షాకింగ్ సర్వే.. కాంగ్రెస్‌కు ఇక ఎదురులేదా?
రైతు కమిషన్ మెంబర్ సెక్రటరీకి చెక్ పవర్ ఇచ్చినప్పటికీ నిధుల విడుదలకు మాత్రం అధికారులు మాత్రం మోకాలడ్డుపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో కమిషన్ ఇటీవల కొండారెడ్డిపల్లిలో జరిగిన రైతులకు భూసార కిట్ల పంపిణీ, పంటల మార్పిడి పై అవగాహన కార్యక్రమం నిర్వహణకు సైతం కమిషన్ సభ్యులే సొంత డబ్బులతోనే నిర్వహించినట్లు తెలిసింది. అది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ అధికారులు మాత్రం నిధుల విడుదలకు ప్రొవిజన్ లేదని చెప్పినట్లు సమాచారం. బీఆర్కే భవన్లో ఏ సమావేశం నిర్వహించాలన్న సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఎవరైనా స్పాన్సర్లు ముందుకొస్తే వారితో ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్టడీ టూర్ లకు వెళ్లాలన్నా కమిషన్ వెనుకంజ వేస్తున్నట్లు ఆ కమిషన్ లోని సభ్యులే అభిప్రాయపడుతున్నారు. ప్రొవిజన్ పేరుతో కమిషన్ ను అధికారులు కట్టిపడేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
రైతు కమిషన్ నిత్యం రైతులతో మమేకం అయిఉంటుంది. అయితే అన్ని కార్యక్రమాలను కమిషన్ చేస్తుండటంతో కొందరికి ఇది నచ్చడం లేదనే ప్రచారం జరుగుతుంది. అందుకే ప్రతిపనికి ప్రొవిజన్ పేరుతో నిధుల విడుదలకు అడ్డుపడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అధికారులకు మాత్రం ఎలాంటి ప్రొవిజన్ ఉండదని..వారు టూర్లకు వెళ్లినా నిధులు విడుదల చేసుకోవచ్చని.. తీరా కమిషన్ కు వచ్చేవరకు మాత్రం నిబంధనలు అడ్డువస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తే తప్ప కమిషన్ చేపట్టే కార్యక్రమాలకు నిధులు విడుదల అవుతాయని.. మరిన్ని రైతు పక్షాన కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని కమిషన్ కు చెందిన ఓ సభ్యుడు అభిప్రాయపడ్డారు.
Also Read: మే 31 వరకు నో ఇజ్రాయెల్ ఫ్లైట్స్.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం!