E-Paper
Advertisement

GHMC: ముగిసిన నోటీసుల జారీ.. ఇక వచ్చేవారం నుంచి ఆస్తులు సీజ్..?

GHMC: ముగిసిన నోటీసుల జారీ.. ఇక వచ్చేవారం నుంచి ఆస్తులు సీజ్..?
Advertisement

GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అతి పెద్ద స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తమాన సంత్సరం బకాయిలతో పాటు వేల కోట్లలో పేరుకుపోయిన మొండి బకాయిలను చెల్లించాలని బకాయిదారులకు ఫస్ట్ నోటీసులు జారీ చేసిన అధికారులు ఫైనల్ గా సుమారు మూడున్నర లక్షలకు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ అయిన ఆస్తుల యజమానులు వెంటనే బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో సోమవారం నుంచి ఆస్తులను సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది.

రూ 1100 కోట్ల ట్యాక్స్ కలెక్షన్!..

జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లు కాకముందు మొత్తం 23 లక్షల ఆస్తుల నుంచి వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 3 వేల కోట్ల ట్యాక్స్ కలెక్షన్ ను లక్ష్యంగా పెట్టుకోగా, మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్, 150 మున్సిపల్ వార్డుల్లో ఆస్తులు (ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్) సంఖ్య సుమారు 11 లక్షలకే పరిమితమైంది. కార్పొరేషన్లను విభజించిన తీరునే ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ ను కూడా మూడు ముక్కలుగా విభజించారు. విభజన తర్వాత కొత్తగా మిగిలిపోయిన జీహెచ్ఎంసీ మార్చి నెలాఖరు కల్లా సుమారు రూ. 1100 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టుకోగా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 749 కోట్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 813 కోట్లు, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.444 కోట్లు వసూలైనట్లు తెలిసింది. వీటిలో జీహెచ్ఎంసీ రూ. 1100 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ ను లక్ష్యంగా పెట్టుకోగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. వెయ్యి కోట్లు, మల్కాజ్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 800 కోట్లను వసూలు చేయాలని టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Also Read: KTR: అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలా.. కేటీఆర్ ఫైర్..!

23 నుంచి మూడు కార్పొరేషన్లలో ప్రాపర్టీలు సీజ్‌లు..

మూడు కార్పొరేషన్లు ఏర్పాటు కాకముందున్న సుమారు 23 లక్షల ఆస్తుల్లో దాదాపు 11లక్షల ఆస్తులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, మిగిలిన 12 లక్షల ఆస్తులను సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు పంపం చేశారు. జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన రెండు కార్పొరేషన్లలోనూ అధికారులు మొండి బకాయిలు, వర్తమాన సంవత్సర కరెంట్ బకాయిదారులకు ఫైనల్ గా రెడ్ నోటీసులు జారీ చేసినట్లు, ఈ నెల 23 నుంచి వర్తమాన సంసత్సరానికి సంబంధించి, గడిచిన కొద్ది ఏళ్లుగా పెద్ద మొత్తంలో బకాయి పడ్డ ఆస్తులను గుర్తించి, సీజింగ్ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. వర్తమాన ఆర్థిక సంసత్సరం ముగిసేందుకు ఇంకా కేవలం 38 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో టార్గెట్లు చేరేందుకు మిగిలిన ట్యాక్స్ బకాయిలను మూడు కార్పొరేషన్లకు ఇప్పటికే డివైడ్ చేసిన ట్యాక్స్ స్టాఫ్ కు డైలీ వారీగా కలెక్షన్ టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

వడ్డీలో 90 శాతం మాఫీ..

Advertisement

సోమవారం నుంచి ట్యాక్స్ కలెక్షన్ పై డైలీ టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్షలు వంటివి నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పెద్ద మొత్తం బకాయి పడ్డ ఆస్తుల యజమానులతో నేరుగా డిప్యూటీ కమిషనర్లు చర్చించి, ప్రస్తుతం అమల్లో ఉన్న వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) గురించి వివరించి, వెంటనే బకాయిలు చెల్లిస్తే, దానిపై విధించిన వడ్డీలో 90 శాతం మాఫీ చేయనున్నట్లు వివరించి, యజమానులు ట్యాక్స్ చెల్లించేలా చైతన్యవంతులను చేయాలని సూచించినట్లు సమాచారం. భారీ మొత్తంలో బకాయిలున్న ఆస్తుల యజమానులతో అవసరమైతే జోనల్ కమిషనర్లు కూడా సంప్రదింపులు జరిపి వసూలు చేయాలని కూడా ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.

Also Read: Tirumala Laddu: మండలిలో ఘోర అపచారం.. లోకేష్ వదిలిన వీడియోలో అసలేముంది?

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×