E-Paper
Advertisement

కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే.. కాంగ్రెస్ రైతుల ఉసురు తీస్తోంది, హరీష్ రావు సంచలనం

కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే.. కాంగ్రెస్ రైతుల ఉసురు తీస్తోంది, హరీష్ రావు సంచలనం
Advertisement

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. కరోనా వైరస్ మనుషుల ప్రాణాలు తీస్తే.. ఈ కాంగ్రెస్ పాలన రైతుల ఉసురు తీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి తీరు ‘బాత్ కరోడో మే.. కామ్ పకోడో మే’ అన్నట్లుగా తయారైందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందరినీ నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కడమే కాకుండా.. గతంలో కేసీఆర్ అందించిన పథకాలను కూడా రేవంత్ రెడ్డి నిలిపివేశారని విమర్శించారు. ఎస్సీ.. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని.. ఈ రెండున్నరేళ్లలో కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి లబ్ధి కూడా జరగలేదని దుయ్యబట్టారు.

Advertisement

వ్యవసాయ రంగంలో కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తు చేస్తూ హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడకు ఏనాడైనా గోదావరి జలాలు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎస్సారెస్పీ ఫేజ్-2 పూర్తి చేసి ఈ ప్రాంత పొలాలకు సాగునీరు అందించామని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో హమాలీల కొరత ఉన్నా.. బీహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో కూలీలను రప్పించి మరీ రైతుల ధాన్యాన్ని సేకరించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్న చరిత్ర తమదని.. ఈ ఏడాది 90 లక్షల టన్నులు కొంటామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఇప్పటివరకు కనీసం 17 లక్షల టన్నులు కూడా కొనలేదని ఎండగట్టారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఘాటు విమర్శలు చేస్తూ.. కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఓడిపోయినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారని ప్రశంసించారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం కేవలం ఆన్లైన్ కే పరిమితమయ్యారని విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి అస్తమానం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.. ఏసీ గదులు వదిలి కల్లాల వద్దకు రావాలని డిమాండ్ చేశారు. యూరియా అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ రైతులను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్త రాజేష్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ.. ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వమే అన్యాయంగా పొట్టనబెట్టుకుందని ఆరోపించారు.

Advertisement

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. త్వరలోనే తెలంగాణలో బెంగాల్.. కేరళ తరహా మార్పు వస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. అధికార గర్వంతో అమాయక కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ప్రతి ఒక్కరి తాట తీస్తామని హెచ్చరించారు. వడ్డీతో సహా లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని.. ‘కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె’ అనే నినాదం ఊరూరా వినిపిస్తోందని చెప్పారు. కార్యకర్తలందరూ ఐక్యంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ALSO READ: తమిళనాడులో రసవత్తర రాజకీయం.. విజయ్‌కు అష్టకష్టాలు, ఎవరా ఆరుగురు ఎమ్మెల్యేలు?

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×