E-Paper
Advertisement

Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి దోషం పట్టుకుందని, అందుకే ఆయన ‘ఉత్త మాటలు’ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

పాలమూరు ప్రాజెక్ట్ కోసం నిరంతరం శ్రమించాం… 

Advertisement

పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తాను వ్యక్తిగతంగా నేల మీద పడుకుని పనిచేశానని హరీష్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని ఆయన స్పష్టం చేశారు. ‘మేము అధికారంలో ఉన్నప్పుడు ఏడు కీలక అనుమతులు తీసుకువచ్చాం. కానీ గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా ఎందుకు తీసుకురాలేకపోయింది?’ అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించారా..? లేదా..? అన్న అంశంపై ఉత్తమ్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టులను అడ్డుకున్న చరిత్ర  కాంగ్రెస్ దే..

Advertisement

గతంలో గ్రీన్ ట్రిబ్యునల్‌లో, కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ నేతలదేనని హరీష్ రావు విమర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (DPR) వాపస్ వచ్చి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. ‘బీఆర్ఎస్ హయాంలోనే రెండు టన్నెల్స్ పనులు పూర్తయ్యాయి. సొంత శాఖపై పట్టు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన చేతకానితనాన్ని మాపై రుద్దుతున్నారు. ఆయనకు ఎప్పుడు జ్ఞానం వస్తుందో అర్థం కావడం లేదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రాజెక్టులపై నిర్లక్ష్యం.. 

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం 1,900 కోట్లు ఖర్చు పెట్టి పనులు వేగవంతం చేసిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిని విస్మరించిందని హరీష్ రావు ఆరోపించారు. కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రెండేళ్ల క్రితమే కొబ్బరికాయ కొట్టినా, ఇప్పటివరకు డీపీఆర్ ఎందుకు పంపలేదని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు మూడు డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని, ఇది వారి అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. పాలమూరు ప్రజలకు కాంగ్రెస్ నేతలే అసలైన ద్రోహులని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Related News

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×