E-Paper
Advertisement

రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రులు గోవా, ఢిల్లీ ట్రిప్పులా?: హరీశ్‌రావు

రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రులు గోవా, ఢిల్లీ ట్రిప్పులా?: హరీశ్‌రావు
Advertisement

Harish Rao: తెలంగాణలో రైతులు, ప్రజలు తాగు, సాగు నీటి ఇబ్బందులతో సతమతమవుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను, అధికారుల గందరగోళ తీరును ఆయన ఎత్తిచూపారు.

రైతుల ఇబ్బందులు కనిపించడం లేదా..?

Advertisement

రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు గోవా, ఢిల్లీ అంటూ విహారయాత్రలు తిరుగుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఎల్ నినో పరిస్థితులపై ఉదయం 11 గంటలకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని, రైతు వేదికల వద్దకు రావాలని అధికారుల ద్వారా సర్క్యులర్లు ఇప్పించారన్నారు. అయితే ఉదయం 9:52 గంటలకు కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అని, మళ్లీ 11:15 గంటలకు ఉందని, ఆ తర్వాత సీఎం రాకుండా డిప్యూటీ సీఎం వస్తారని ఇలా గంటల వ్యవధిలో మాట మారుస్తూ చిన్నపిల్లల ఆటలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందస్తు చర్యలు శూన్యం

Advertisement

ఎఎల్ నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని హరీశ్ రావు విమర్శించారు. దేవాదుల, కల్వకుర్తిలో నీళ్లు లిఫ్ట్ చేసి ఉంటే రాష్ట్రంలో కరవు పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల పేరుతో 29 టీఎంసీలను ఖాళీ చేసి, పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని మండిపడ్డారు. దీనివల్ల హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకంటే బీరు ఫ్యాక్టరీలే ముఖ్యమా?

ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నప్పటికీ, తాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వాన్ని వదిలి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కోట్ల మంది ప్రజల దాహం కంటే లిక్కర్ కంపెనీల లాభాలే ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయా అని ప్రశ్నించారు. ఆబ్కారీ శాఖ తీరును తప్పుబట్టిన ఆయన, తాగునీటిని మళ్లించి కంపెనీలకు కట్టబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని హెచ్చరించారు.

Also Read: కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు.. రేవంత్ రెడ్డికి రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్!

Tags

Related News

కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు.. రేవంత్ రెడ్డికి రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్!

దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇల్లు అమ్ముతానని రూ.31.77 లక్షలు వసూలు.. మరో బ్యాంకులో తనఖా!

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

కమీషన్ల కోసమే యాదాద్రి పవర్ ప్లాంట్.. బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బోరబండలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని చిన్నారి మృతి!

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఈసీ తరహా పవర్స్ ఉండాలి: కల్వకుంట్ల కవిత

Big Stories

Advertisement
×