Sehwag On Team India: టీమిండియా క్రికెటర్ల పై వీరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సిక్స్ ప్యాక్ యుగం నడుస్తోందని.. దీనికోసం కుర్రాళ్ళు అందరూ పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. టీమిండియా క్రికెటర్లు కూడా దీనిపైన ఫోకస్ చేయాలని కోరారు. సిక్స్ ప్యాక్ సాధించి క్రికెట్ పైన దృష్టి పెట్టాలని టీమిండి ఆటగాళ్లకు సూచనలు చేశారు. వ్యాపారాలు అలాగే సోషల్ మీడియాలో లైక్స్ గురించి అసలు ఆలోచించకూడదని… వాటిని పక్కకు పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. మైదానంలో ప్రదర్శన కోసం ప్రతినిత్యం పోరాటం చేయాలని టీమిండియా ప్లేయర్లకు సూచనలు చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా క్రికెటర్ల సిక్స్ ప్యాక్ వ్యవహారంపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది క్రికెటర్లు సిక్స్ ప్యాక్ లు పెంచి… ఆట పైన దృష్టి సారిస్తుంటే, మరికొంతమంది జల్సాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ తమకు ఉందని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహించారు. సోషల్ మీడియాలో క్రికెటర్ల సిక్స్ ప్యాక్స్ కు కచ్చితంగా లైక్స్ వస్తాయి… దీన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది అనామక క్రికెటర్లు సిక్స్ ప్యాక్స్ పెంచి రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
అలాంటి సిక్స్ ప్యాక్స్ దేనికి పనికిరాని ఆగ్రహించారు. సిక్స్ ప్యాక్ సాధించి టీమిండియా కెప్టెన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అందరూ ఆట పైన దృష్టి సారిస్తున్నారని ప్రశంసించారు. ఎవరి జోలికి వెళ్లకుండా… మంచి ఫిట్నెస్ సాధించి దుమ్ము లేపుతున్నారని వెల్లడించారు. దిక్కుమాలిన జల్సాలు మానేసి సిక్స్ ప్యాక్ లు… టీమిండియా కోసం పనిచేయాలని సూచనలు చేశారు. అప్పుడే విరాట్ కోహ్లీ లాగా స్టార్ క్రికెటర్ అవుతారని వెల్లడించారు.
టీమిండియా కెప్టెన్ గిల్ పై వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) ప్రశంసల వర్షం కురిపించారు. అతని సారథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియాకు (Team India) రావడం గ్యారెంటీ అని అంచనా వేశారు. స్థిరత్వంతో బ్యాటింగ్ చేయగల సత్తా గిల్ కు ఉందని ప్రశంసించారు. ఇంగ్లాండ్ గడ్డపై ( England) మొన్న 600కు పైగా పరుగులు సాధించి సునీల్ గవాస్కర్ (Sunil gavaskar) లాంటి పెద్ద క్రికెటర్ రికార్డు బద్దలు కొట్టారని గుర్తు చేశారు. మొన్న వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ చేసి తన సత్తా ఏంటో చూపించాడని వివరించారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఆడగల కెప్టెన్ టీమిండియాకు దక్కడం గ్రేట్ అన్నారు.