BigTV English
Advertisement

World’s Highest Railway Line: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే మార్గం, ప్రయాణీకులు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోవాల్సిందే!

World’s Highest Railway Line: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే మార్గం, ప్రయాణీకులు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోవాల్సిందే!

Qinghai-Tibet Railway: ప్రపంచంలో ఎన్నో వింతైన రైల్వే వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో ఒకటి క్వింగ్‌ జాంగ్ రైల్వే(Qingzang Railway). ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే మార్గంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మార్గం టిబెట్‌ లోని లాసాను చైనాలోని జినింగ్‌ను కలుపుతుంది. దీనిని అధికారికంగా క్వింగాయ్-టిబెట్ రైల్వే(Qinghai-Tibet Railway) అని పిలుస్తారు. ఈ రైల్వే ఎన్నో వింతలు, విశేషాలను కలిగి ఉంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ ఎత్తైన రైల్వే మార్గం: క్వింగ్‌ జాంగ్ రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే మార్గంగా గుర్తింపు తెచ్చుకుంది.  ఇది సముద్ర మట్టానికి 5,072 మీటర్ల ఎత్తులో ఉన్న తంగులా పాస్‌ను దాటుతూ వెళ్తుంది. ఇది ఆ రైల్వే మార్గంలోనూ అత్యంత ఎత్తైన ప్రాంతం.

⦿ ఇంజనీరింగ్ అద్భుతం: ఈ రైల్వే 1,956 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 960 కిలోమీటర్ల మార్గం 4,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్నాయి. ఈ రైల్వే నిర్మాణం అత్యంత సవాళ్లతో కూడుకున్నది. హిమాలయ పర్వత శ్రేణులు, మంచుతో కూడిన భూమితో పాటు కఠినమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది.  ఘనీభవన భూమి కరిగిపోకుండా నిర్మాణ స్థిరత్వం కోసం ప్రత్యేక థర్మల్ పైపులు, శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగించారు.


⦿ ఆక్సిజన్ సరఫరా: ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల, రైళ్లలో ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ప్రతి సీటు దగ్గర ఆక్సిజన్ అవుట్‌ లెట్లు ఉన్నాయి, రైలు లోపల ఒత్తిడిని నియంత్రించే సాంకేతికతను అమర్చారు.

⦿ పర్యావరణ రక్షణ:  టిబెట్ సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి, రైల్వే నిర్మాణంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోబడ్డాయి.  వన్యప్రాణుల రైల్వే మార్గం మీదికి రాకుండా జంతువుల కోసం ప్రత్యేక అండర్‌ పాస్‌లు నిర్మించారు.

⦿ సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యత:  ఈ రైల్వే టిబెట్‌ను, చైనాను కలుపుతుంది. దీనివల్ల టిబెట్‌లో ఆర్థికాభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడికి కారణం అయ్యింది. లాసా నగరానికి ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు రావడం మొదలు పెట్టారు. దీనివల్ల టికెట్ ఆర్థికాభివృద్ధికి కారణం అయ్యింది.

⦿ రైళ్లలో ఆధునిక సాంకేతికత: ఈ మార్గంలో నడిచే రైళ్లు అత్యాధునిక సౌకర్యాలతో తయారు చేశారు.  ఇందులో UV-రక్షిత కిటికీలు, అధిక సామర్థ్యం కలిగిన ఇంజిన్లు, శీతల వాతావరణంలో పనిచేసేందుకు అనుగుణంగా రూపొందించిన బోగీలు ఉన్నాయి. ఈ రైలు ట్రాక్‌లు ఎక్కువగా డబుల్-ట్రాక్. ఎలక్ట్రిఫికేషన్ చేయబడ్డాయి. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు వేగవంతమైన, సమర్థవంతమైన రవాణాను అందిస్తాయి.

⦿ ప్రయాణ సౌకర్యం: ఈ మార్గంలో రైలు ప్రయాణీకులకు మూడు రకాల సీటింగ్ ఆప్షన్లను పొందుతారు. సాఫ్ట్ స్లీపర్, హార్డ్ స్లీపర్, హార్డ్ సీట్.  వీటిలో సాఫ్ట్ స్లీపర్ అత్యంత సౌకర్యవంతమైనది. రైలులో డైనింగ్ కార్, ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ రైల్వే ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడుతుంది. ప్రపంచంలోని అత్యంత సాహసోపేతమైన రైలు ప్రయాణాలలో ఇది ఒకటిగా కొనసాగుతుంది. క్వింగ్‌జాంగ్ రైల్వే 2006 జూలై 1న ప్రారంభించబడింది.

Read Also: 180 మీటర్లకు బైక్ రైడ్ బుకింగ్, మహిళ చేసిన పనికి అందరూ షాక్!

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×