E-Paper
Advertisement

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు
Advertisement

Hyderabad: హైదరాబాద్ నగరంలో నీటిని అనవసరంగా వృథా చేస్తున్న ఘటన క్రమంగా పెరుగుతున్నాయి. వారం లేకుంటే రెండు వారాలకు ఒక ఘటన వెలుగులోకి వస్తుంది. తాజాగా జూబ్లీహిల్స్‌లో అనగనగా హోటల్‌పై జలమండలి అధికారులు కొరడా ఝలిపించారు. ఏకంగా రూ.20 వేలు జరిమానా విధించారు. అసలు ఏం జరిగింది?

హైదరాబాద్ సిటీలో వాటర్ అధికారులు నిఘా

ఎల్‌నినో కారణంగా వేసవి రాకముందే హైదరాబాద్ సిటీలో నీటి కష్టాలు మొదలయ్యే పరిస్థితి సూచనలు కనిపిస్తున్నాయి. వానలు లేక భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదుకావడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీనికితోడు జలమండలి ఇస్తున్న నీటిని అనవసరంగా వినియోగిస్తూ దుర్వినియోగం చేస్తు్న్నారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జలమండలి శాఖ అధికారులు ఓ కన్నేశారు. ఈ క్రమంలో నీటిని వృథా చేసిన ఘటనలు వెలుగులోకి రావడంతో జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. ఓ వ్యక్తికి సంబంధించి ఏకంగా రూ.20 వేల జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో జరిగింది.

నీటిని వృథా చేసినందుకు ఏకంగా రూ.20 వేల జరిమానా

Advertisement

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జూబ్లీహిల్స్ రహదారిపై వెళ్తుండగా ‘అనగనగా’ హోటల్ ప్రాంగణాన్ని నీటితో శుభ్రం చేయడాన్ని సదరు అధికారి గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎండీ, సహజ వనరులను ఇలాంటి అవసరాలకు విచక్షణారహితంగా వినియోగించరాదని తెలిపారు. వారికి నోటీసు జారీ చేసి జరిమానా విధించాలని కింద స్థాయి అధికారులను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ హోటల్ ఓనర్ గాయత్రి రెడ్డికి రూ.20,000 జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని అధికారులు వసూలు చేశారు. నీటి వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రాంగణాలు, రహదారులు శుభ్రం చేసేందుకు అధికంగా వినియోగించడం మానుకోవాలని సూచన చేశారు.

ఎల్ నినో ప్రభావం… వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్

తాగునీరు సహా నీటి వనరులను దుర్వినియోగం చేసినట్టు గుర్తిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు వాటర్ సమస్యను గుర్తించిన నగరంలోని నీటి వ్యాపారులు ట్యాంకర్ల రేటు అమాంతంగా పెంచేశారు. గతేడాదితో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా అపార్టుమెంటు వాసుల నుంచి వసూలు చేస్తున్నారు. గతేడాది ఈ సమయంలో రోజుకు 3 వేల ట్యాంకర్లకు డిమాండ్ ఉండేది. ప్రస్తుతం అది 6 వేలకు చేరింది. ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. అక్టోబర్ ఐదున ఏకంగా 6700 ట్యాంకర్ల బుకింగ్స్‌తో నీటి డిమాండు చెప్పకనే చెబుతోంది.

Advertisement

ALSO READ: గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

భూగర్భ జలాలు పడిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నగరంలోని 80 శాతం వాటర్ ట్యాంకర్లు వెస్ట్ జోన్ లో ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లాంటి ఏరియాల్లో టెక్ కంపెనీలు, షాపులు ఎక్కువగా ఉండడం కూడా కారణంగా చెబుతున్నారు. బోర్‌‌వెల్స్ ఎండిపోయి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. శేరిలింగంపల్లి, హఫీజ్‌‌పేట్, మణికొండ, సన్‌సిటీ, కాళిమందిర్ వంటి ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరగడం, గేటెడ్ కమ్యూనిటీలు పెరగడంతో రోజువారీ ట్యాంకర్ల బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

Related News

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

Big Stories

Advertisement
×