E-Paper
Advertisement

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!
Advertisement

Swarnagiri Temple Land Row: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మానేపల్లి హిల్స్‌ పై ఉన్న స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం మరో వివాదంలో చిక్కుకుంది. ఆలయ వెబ్ సైట్ నుంచి మొదలైన లొల్లి ఇప్పుడు సదరు ఆలయం నిర్మించిన భూముల వ్యవహరం వరకు వెళ్లింది. యాదగిరిగుట్ట దేవస్థానం అధికారుల అభ్యంతరానికి ప్రధాన కారణం YTD పేరుతో నిర్వహించిన వెబ్‌సైట్. యాదాద్రి ఆలయ అభివృద్ధికి సంబంధించిన యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం గతంలో అధికారిక గెజిట్ విడుదల చేసింది. అయితే.. స్వర్ణగిరి ఆలయానికి ఇప్పటికే ప్రత్యేకంగా అధికారిక వెబ్‌సైట్ ఉండగా.. YTD పేరుతో మరో వెబ్‌సైట్ ఎందుకు నిర్వహించారన్నది యాదగిరిగుట్ట అధికారుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆ వెబ్‌సైట్‌లో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పోలి ఉండే ఫొటోలు, వివరాలు కనిపించడంపై కూడా అధికారులు సీరియస్ అయ్యారు. భక్తుల్లో యాదగిరిగుట్ట ఆలయ అధికారిక వెబ్‌సైట్ విషయంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ లీగల్ నోటీసులు జారీ చేశారు.

వివరణ ఇచ్చిన స్వర్ణగిరి నిర్వాహకులు

లీగల్ నోటీసులు అందడంతో స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులు యాదగిరిగుట్ట ఈవో భవానీ శంకర్‌ను కలిసి తమ వివరణ ఇచ్చారు. గుట్ట నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో YTD పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ను ఇప్పటికే క్లోజ్ చేశామని నిర్వాహకులు తెలిపారు. వెబ్‌సైట్ ప్రారంభించడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి తమ కుటుంబ ఇలవేల్పు కావడంతోనే YTD పేరుతో వెబ్‌సైట్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం స్వర్ణగిరి ఆలయ చైర్మన్ అందుబాటులో లేరని.. ఆయన వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులను కలిసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్వర్ణగిరి నిర్వాహకులు తెలిపారు.

స్వర్ణగిరి భూములపై రెవెన్యూ అధికారుల ఫోకస్

Advertisement

వెబ్‌సైట్ వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే.. స్వర్ణగిరి ఆలయానికి సంబంధించిన భూములపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించడం ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది. ఆలయ భూములకు సంబంధించిన రికార్డులు, వాటి వివరాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భూముల కేటాయింపు, రికార్డులు, వినియోగానికి సంబంధించిన అంశాలపై అధికారులు పరిశీలన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణలో ఏ అంశాలు బయటకు వస్తాయన్నది స్పష్టత రావాల్సి ఉంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మానేపల్లి హిల్స్‌ పై సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలు చేపట్టారు. ప్రధాన ఆలయం సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు ఆలయ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. గర్భగుడిలో 12 అడుగుల ఎత్తైన వేంకటేశ్వరస్వామి విగ్రహంతో పాటు ఆలయ ప్రాంగణంలో 40 అడుగుల హనుమాన్ విగ్రహం, జల నారాయణ స్వామి విగ్రహం, భారీ గంట లాంటి నిర్మాణాలు ఉన్నాయి. శ్రీవారి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గోశాల, వృద్ధాశ్రమం, మెడిటేషన్ సెంటర్‌తో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు వెల్లడించింది.

రుసుముల వసూళ్లపైనా అధికారుల దృష్టి

Advertisement

మరోవైపు ఆలయంలో దర్శనం, ప్రత్యేక సేవలు, వీఐపీ లైన్లు, పార్కింగ్ తదితర అంశాలకు సంబంధించిన రుసుములపై గతంలో కొందరు భక్తులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైనా అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఒకవైపు యాదగిరిగుట్ట దేవస్థానం జారీ చేసిన లీగల్ నోటీసులు.. మరోవైపు స్వర్ణగిరి ఆలయ నిర్వాహకుల వివరణ.. ఇప్పుడు భూముల వ్యవహారంపై రెవెన్యూ అధికారుల పరిశీలన.. తర్వాత ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అధికారుల విచారణ, ఇరు ఆలయాల మధ్య వివరణల అనంతరం ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.

Read Also: స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట దేవస్థానం లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?

Tags

Related News

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

లైఫ్ టైమ్ ఫ్రీ ఫ్లైట్ పాస్.. పైలట్‌ స్మిత్ మచ్చార్‌కు ఇజ్రాయెల్ సూపర్ గిఫ్ట్!

వెదురు సాగుతో సిరుల వర్షం.. ఒక్కసారి నాటితే ఏళ్ల పాటు ఆదాయం!

లోకో పైలెట్ vs అసిస్టెంట్ లోకో పైలెట్.. ఇద్దరిలో అసలు రైలును నడిపేది ఎవరు?

Big Stories

Advertisement
×