E-Paper
Advertisement

1990 స‌మ‌యంలో ప్ర‌తీ మ్యాచ్ లోనూ టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం

1990 స‌మ‌యంలో ప్ర‌తీ మ్యాచ్ లోనూ టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం
Advertisement

Shoaib Akhtar On IND VS PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఆ రోజున ఎంత పని ఉన్నా.. టీవీలకే అతుక్కుపోతారు జనాలు. ఇక వరల్డ్ కప్ లాంటి మ్యాచ్లు జరిగితే… దాదాపు మూడు రోజులు పండగ వాతావరణం ఉంటుంది. అలాంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో పాక్ పై టీమిండియా వరుసగా విజయాలు నమోదు చేస్తోంది… కానీ అప్పట్లో మేమే బాగా గెలిచే వాళ్ళమని ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్య గెలుస్తున్నారు కానీ..అప్ప‌ట్లో మాత్రం పాకిస్తాన్ అంటేనే ఇండియ‌న్ క్రికెట‌ర్లు వ‌ణికిపోయేవారని బాంబ్ పేల్చారు. 1990 ద‌శ‌కంలో ప్ర‌తీ మ్యాచ్ లోనూ పాకిస్తాన్ గెలిచేద‌న్నారు.

1990 స‌మ‌యంలో టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం

1990 సంవత్సరం కాలం నాటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ల గురించి తాజాగా మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1990 దశకంలో పాకిస్తాన్ జట్టు అత్యంత బలంగా ఉండేదని గుర్తు చేశారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన టీమ్స్ ను కూడా ఓడించే వాళ్ళమని తెలిపారు. అదే సమయంలో ఇండియా పై పాకిస్తాన్ ఆధిపత్యం చెలాయించేది అంటూ వ్యాఖ్యానించారు.  అప్పట్లో పాకిస్తాన్ బౌలింగ్ అంటే.. ఇండియన్ క్రికెటర్లు భయపడి పోయేవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ద్వైపాక్షిక, ఐసీసీ టోర్నమెంట్స్ లలో ఇండియాను చిత్తుచిత్తుగా ఓడించే వాళ్ళమని ప్రకటించారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

ఇంజమాం ఉల్ హక్, ముస్తాక్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ , సయుద్ అన్వర్ లాంటి క్రికెటర్లు ఎంతోమంది అప్పట్లో తమ జట్టులో ఉండేవారన్నారు. దీంతో ఏ జట్టునైనా తాము అవలీలగా భయపెట్టించే వాళ్ళం అని వెల్లడించారు. అందుకే టీమిండియాను కూడా దారుణంగా ఓడించే వాళ్ళం అన్నారు. కానీ ఇప్పటి టీమ్ ఇండియా మాత్రం చాలా బలంగా ఉందని గుర్తు చేశారు. అందుకే పాకిస్తాన్ గెలవడం గగనం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది కెప్టెన్లు వచ్చినా కూడా టీమిండియాను ఓడించలేకపోతున్నారని.. వివరించారు. టీమిండియాపై గెలిచే ప్రయత్నం చేయాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సూచనలు చేశారు. ఆదిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా పనిచేయాలని వివరించారు.

1990లో పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా రికార్డులు

Advertisement

1990 దశకంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 42 వన్డేలు జరిగాయి. ఇందులో టీమిండియా 14 గెలిస్తే.. పాకిస్తాన్ ఏకంగా 25 మ్యాచ్ లలో విజయం సాధించింది. మూడు మ్యాచ్ లు ఫలితం తేలలేదు. అంటే అక్త‌ర్ చెప్పిన‌ట్లుగానే, 1990 దశకంలో టీమిండియాపై పాక్ ఆధిప‌త్యం చెలాయించింది.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

 

 

Related News

ఎవ‌డికి ఇచ్చేది లేదు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు నేనే కెప్టెన్‌

వివాదంలో ఆజం ఖాన్…డాలర్ నోటుతో చెమ‌టలు తుడుచుకుంటూ

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబ‌ర్ ను హీరో చేయకండి…తేడా వ‌స్తే 32 ప‌ళ్లు రాళ్లు రాల‌తాయి

సిరాజ్ ను అవ‌మానించిన గంభీర్..బౌండ‌రీ గేట్ ద‌గ్గరే ప‌చ్చిబూతులు

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అభిమానుల‌కు మోడీ స‌ర్కార్ బిగ్ షాక్ !

Big Stories

Advertisement
×