E-Paper
Advertisement

చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!

చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!
Advertisement

Chikkadpally Murder: హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లిలోని మాచర్ల జ్యువెలరీ షాప్ సమీపంలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే..

Advertisement

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేందర్ (34), తేజస్వి (29) దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం గంటల సమయంలో ఇద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన నరేందర్, ఇంట్లోని రోకలిబండను తీసుకుని భార్య తేజస్వి తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై తేజస్వి అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది.

పోలీసుల దర్యాప్తు.. నిందితుడి కోసం గాలింపు

Advertisement

సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే తేజస్వి తీవ్ర గాయాల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు నరేందర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గల అసలు కారణాలపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

Tags

Related News

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

అస్తిత్వ పోరాటానికి దృశ్య రూపం.. థియేటర్‌లో ‘పారడైజ్’ మూవీ వాచ్.. కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 30 మంది ప్రయాణికులు, చౌటుప్పల్ వద్ద ఘటన

Big Stories

Advertisement
×