H-City Project: స్వేచ్ఛ బ్యూరో: మహానగరంలోనే అత్యంత ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతం అది. అక్కడ రానున్న 30 ఏళ్లను దృష్టి లో పెట్టుకుని సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గత పాలకుల హయాంలో రూపకల్పన చేసిన ఎస్ఆర్ డీపీ ప్రాజెక్టును ప్రస్తుత సర్కారు హెచ్ సిటీగా మార్చి ఏళ్లు గడుస్తున్నా, ఎట్టకేలకు క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రూ. 1090 కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ లను నిర్మించే పనులకు శుక్రవారం ఉదయం ముగ్దా జంక్షన్ వద్ద అధికారులు భూమి పూజ నిర్వహించి, అదే రోజు రాత్రి నుంచి పనులను ప్రారంభించారు.
మొదటి దశలో రూ. 580 కోట్లు, రెండో దశలో రూ. 510 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ సహదేవ్, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొని భూమి పూజ చేశారు. దీంతో హెచ్ సిటీ పనులు పట్టాలెక్కాయి. పనులను వీలైనంత త్వరగా విజిబిలిటీ స్థాయికి తీసుకెళ్లేలా పనుల్లో వేగంగా పెంచే విషయంపై సర్కారు స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు సమాచారం. రూ. 1090 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టున్న మొత్తం ఆరు రద్దీ జంక్షన్లలో యుటిలిటీలను బదలాయించే పనులను కూడా చేపట్టనున్నారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు శనివారం నుంచి మరింత ముమ్మరమయ్యే అవకాశాలుండటంతో ఇప్పటికే పోలీసులు పార్కు చుట్టూ ట్రాఫిక్, ఆంక్షలను అమలు చేయటంతో పాటు ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ రూట్లలో ప్రయాణించే వాహనదారులకు ప్రత్యేకంగా సూచనలు కూడా జారీ చేశారు. గత 2024 డిసెంబర్ మాసంలో సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేసిన ఏదాది తర్వాత ఎన్నో సమస్యలను అధిగమిస్తూ ఈ ప్రాజెక్ట్ కు ఎట్టకేలకు మోక్షం కల్గింది. స్థల సేకరణ, ప్రాజెక్టు డిజైనింగ్, భూసార పరీక్షలు, ప్రాజెక్టుల సర్వే విషయాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో హెచ్ సిటీ పనులకు మోక్షం కల్గింది.
Also Read: Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వై ఆకృతిలో రోడ్డు నెంబర్ 45 నుండి కేబీఆర్ మీదుగా యూసఫ్ గూడ వరకు గ్రేడ్ సపరేటర్ ను నిర్మించనున్నారు. కే బి అర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్ నుండి రో డ్డు నెంబర్ 36 వైపు నాలుగు లైన స్టీల్ ఫ్లై ఒవర్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు యూసఫ్ గూడ సైడ్ నుండి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లైన్ల స్టీల్ ఫ్లై ఓవర్, కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, ముగ్ధా జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పటల్ జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్ పాస్ లు, మూడు లైన్ల యూని డైరెక్షన్ లో పంజాగుట్ట వైపు నుండి జూబ్లీ చెక్ పోస్టు వైపు మరో స్టీల్ ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నారు. కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్ నుండి పంజాగుట్ట వైపు మూడు లైన్ల మరో అండర్ పాస్ లను ఏర్పాటు చేసే పనులు శుక్రవారం నుంచి మొదలయ్యాయి.
కేబీఆర్ పార్కు, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు రెండో దశలో చేపట్టనున్న పనుల ప్రతిపాదనలను, పరిపాలనపరమైన మంజూరీతో సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. రూ.510 కోట్ల వ్యయం తో చేపట్టనున్న ఈ పనుల రెండో దశ లో భాగంగా రోడ్డ్ నెంబర్ 45 జంక్షన్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు రెండు లేన్ల మరో అండర్ పాస్ తో పాటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు రెండు లేన్ల మరో ఫ్లై ఓవర్ ను, ఫిల్మ్ నగర్ మహారాజ అగ్రసేన్ జంక్షన్ నుండి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్ పాస్ తో పాటు ఫిల్మ్ నగర్ జంక్షన్ నుండి మహారాజ అగ్రసైన్ జంక్షన్ వైపు రెండు లైన్ల ఫ్లైఓవర్ , మహారాజ అగ్రసేన్ జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుండి ఫిలింనగర్ జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్ పాస్,కేబీఆర్ పార్కు సైడ్ నుండి మహారాజ అగ్రసెన్ వైపు రెండు లేన్ల అండర్ పాస్, మహారాజ అగ్ర సేన్ జంక్షన్ నుంచి రోడ్డు నెంబర్ 10 వైపు రెండు లేన్ల ఫ్లై ఓవర్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్కు సైడ్ రెండు లేన్ల ఫ్లై ఓవర్లను ఏర్పాటు చేయనున్నారు.
The Hyderabad City Integrated Traffic Infrastructure – #HCITI project, with a budget of ₹826 crores, aims to transform traffic around #KBR Park using a series of underpasses and flyovers. Key features include a Y-shaped underpass from Road No. 45 to KBR and Yousufguda, a 4-lane… pic.twitter.com/Di6uqctg0z
— GHMC (@GHMCOnline) September 29, 2024
Also Read: Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క