Hyderabad Mayor Travelled in MTRO train: అనూహ్యంగా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె మెట్రో అధికారులకు పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనం కోసం భక్తులకు స్వాగతం పలుకుతూ పోస్టర్లను ఏర్పాటు చేయాలంటూ వారికి ఆమె సూచించారు. అదేవిధంగా నిమజ్జనాలు జరిగే రోజు ఎక్కువ సమయం వరకు మెట్రో రైళ్లను నడుపాలని, ప్రయాణికులకు సరైన ఏర్పాట్లు చేయాలంటూ ఆమె సూచించారు. మెట్రోలో ప్రయాణిస్తూ పలువురి ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటు ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలను కూడా మెట్రో అధికారులు స్వీకరించాలన్నారు.
Also Read: రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్టు
ఇటు ఎల్లుండి ఖైరతాబాద్ భారీ వినాయకుడిని నిమజ్జనం చేయనున్నారు. స్వామివారి దర్శనానికి నేడు చివరి రోజు కావడం, నేడు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ కు వస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ కు క్యూ కడుతూ వినాయకుడిని దర్శించుకుంటున్నారు. అయితే, ఎల్లుండి వినాయకుడి నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి రేపు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు దర్శించుకునేందుకు ఈరోజు వరకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో నగరంలో వివిధ ప్రాంతాలు, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బడా వినాయకుడిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ మెట్రో స్టేషన్లలో ఎక్కడ చూసిన జనమే కనిపిస్తున్నారు. జనాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఖైరతాబాద్ భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Also Read: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనాలపై దుష్ప్రచారం.. మంత్రి పొన్నం క్లారిటీ