Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది.. ఇప్పటికే మెట్రో ఫస్ట్ ఫేజ్ ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ అంగీకారం తెలిపింది. ఎల్ అడ్ టీకి సంబంధించిన మొత్తం రూ.13వేల కోట్ల అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా ఈ కీలక ఒప్పందంతో ఎల్ అండ్ టీకి రేవంత్ సర్కార్ రూ.2100 కోట్లను ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో ఇక హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ..
అయితే ఇంతకు ముందు పలు మార్లు హైదరాబాద్ మెట్రోను నిర్వహించలేక పోతున్నామని ఎల్ అండ్ టీ తెలిపిని విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రానికి, రాష్ట ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసింది. గత కొన్ని రోజుల నుంచి నష్టాలను భరించలేకపోతున్నామని ఎల్ అండ్ టీ చెప్పుకొచ్చింది. అవసరమైతే మెట్రోను వదులుకోవడానికి కూడా తాము రెడీగా ఉన్నట్టు కూడా సంస్థ తెలిపింది.
చివరకు.. ప్రభుత్వం చేతికి..
పదేపదే వెళ్లిపోతాం అని చెబుతుండడంతో తెలంగాణ ప్రభుత్వమే ఈ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధం అవుతోందని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం కూడా జరిగింది. ఇక ఎల్ అండ్ టీతో ఈ కీలక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది.