BigTV English

Hyderabad Office Space : హాట్ కేకులా సేల్ అవుతున్న ఆఫీస్ స్పేస్ – దేశంలోనే హైదరాబాద్ టాప్

Hyderabad Office Space : హాట్ కేకులా సేల్ అవుతున్న ఆఫీస్ స్పేస్ –  దేశంలోనే హైదరాబాద్ టాప్

Hyderabad Office Space : అంతర్జాతీయ సంస్థల నుంచి డిమాండ్ పెరుగుతుండడం, పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతున్న తరుణంలో హైదరాబాద్ లో ఆఫీస్ స్పెస్ డిమాండ్ అంచనాలకు మించి పెరిగిపోతుందని.. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ – సీబీఆర్ఈ వెల్లడించింది. ఈ సంస్థ హైదరబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్పైసెస్ అసోషియేషన్ సంయుక్తంగా విడుల చేసిన నివేదికలో.. దేశీయంగా మిగతా నగరాలతో పోల్చితే ఆఫీస్ స్పెస్ కు హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందని ఈ నివేదిక వెల్లడిస్తోంది. రానున్న రోజుల్లో ఈ డిమాండ్ ఇలానే పెరుగుతూ.. 2030 నాటికి 20 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటోందని వెల్లడించింది. ప్రస్తుతం నగరంలో 1.37 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ వినియోగంలో ఉన్నట్లు తెలిపిన ఈ నివేదిక.. గత పదేళ్లతో పోల్చితే దాదాపు మూడు రెట్ల ఆఫీస్ స్పేస్ హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.


ప్రస్తుతం దేశంలో ఐటీ సహ ఇతర విభాగాల్లో అనేక సంస్థలున్న బెంగళూరు, దిల్లీ, చెన్నై వంటి నగరాల కంటే హైదరాబాద్ వైపు ఇంటర్నేషనల్ సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలిపిన సీబీఆర్ఈ నివేదిక.. ప్రధాన నగరాల్లో ఉన్న ఆఫీసు స్థలంలో హైదరాబాద్‌ వాటా 15%గా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 18శాతం గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీస్ స్టాక్ గా పేర్కొంది. హైదరాబాద్ నగరంలో 2024లో 1.23 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ బుకింగ్ అయ్యింది. ఇందులో.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డాటా అనలటిక్స్ వంటి రంగాలు ఎక్కువగా ఆఫీస్ స్పేస్ రెంట్ కు తీసుకున్నట్లు వెల్లడైంది. మొత్తంగా టెక్నాలజీ సంస్థల వాటానే 31% గా ఈ నివేదిక వెల్లడించింది. గతంలో ఐటీ రంగాలకు చెందిన సంస్థల నుంచి 30- 35 శాతం డిమాండ్ ఉంటుండేది. కానీ.. ఇప్పుడు ఇతర రంగాల నుంచి సైతం పోటీ ఎక్కువ అవుతుండడం, ఆయా రంగాల సంస్థలు ఎక్కువగా ఆఫీస్ స్పేస్ రెంటు కు తీసుకుంటుండడంతో ఐటీ సంస్థల వాటా తగ్గిపోతున్నట్లు నివేదిక తెలిపింది. మొత్తంగా హైదారాబాద్ నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్స్‌ రంగాల సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు, ఇక్కర అద్దెలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి. రెండేళ్ల కాలంలోనే ఈ సంస్థల ఆఫీస్ స్పేస్ వినియోగంలో 12శాతం వృద్ధి రేటు నమోదైంది. గతేడాది ఆఫీస్ స్పేస్ తీసుకున్న మొత్తం సంస్థల్లో బీసీసీల వాటానే 43% గా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సంస్థల ఏర్పాటులో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. జీసీసీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ నగరం రెండో స్థానంలో ఉంది. గత ఏడాదిలో 53 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని జీసీసీలు అద్దెకు తీసుకున్నాయి.


Also Read : హైదరాబాద్‌లో ఉన్నారా? మాస్కులు పెట్టుకోండి.. లేకపోతే ప్రాణాలు గాల్లోకే!

రానున్న ఐదేళ్లల్లో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ గిరాకీ 1.5 రెట్లు పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది. ఈ స్థాయిలో ఆఫీస్ స్పేస్ పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రధాన కారణమని విశ్లేషించిన నివేదిక.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చోరవతోనే ఇది సాధ్యపడుతోందని ప్రశంసించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించడంతో పాటు, AI, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న పెట్టుబడులతో హైదరాబాద్ కు ఈ డిమాండ్ ఏర్పాటినట్లు తెలుపుతోంది. అలాగే.. ఇక్కడి బలమైన IT/ITeS పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన యువత లభిస్తుండడంతో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) ఏర్పాటు సాధ్యమవుతోందని తెలిపింది. పైగా నగరంలో తక్కువ ధరల్లోనే అద్భుతమైన స్పేస్ అందుబాటులోకి రావడంతో పాటు ఇక్కడి వసతులు, వనరులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

Related News

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Rains Effect: ఓరుగల్లులో చినుకు పడితే చిత్తడే.. ఎన్నాళ్లీ వరద కష్టాలు..

Big Stories

×