E-Paper
Advertisement

అసమాన ప్రతిభ.. అసాధారణ ధైర్యం.. కేంద్ర పతకాల్లో మెరిసిన తెలంగాణ పోలీసులు!

అసమాన ప్రతిభ.. అసాధారణ ధైర్యం.. కేంద్ర పతకాల్లో మెరిసిన తెలంగాణ పోలీసులు!
Advertisement

Police Medals: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేర్వేరు రంగాల్లో అసమాన ప్రతిభ, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 1,057మంది అధికారులకు కేంద్ర హోంశాఖ పతకాలను ప్రకటించింది. 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 301 మందికి పోలీస్​ మెడల్​ ఫర్ గ్యాలంట్రీ, 664 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలను ప్రదానం చేయనున్నారు. అయితే తెలంగాణకు చెందిన 15మంది ఈ ప్రతిష్టాత్మక పతకాలను ఎంపికయ్యారు.

రాష్ట్రపతి విశిష్ట పోలీసు సేవా పతకాలను సికింద్రాబాద్​ జోన్​ అదనపు డీసీపీ జే.నర్సయ్య, ఇంటెలిజెన్స్​ ఎస్పీ జగదీశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు. అలాగే కరీంనగర్​ అదనపు డీసీపీ (అడ్మిన్​) వెంకటరమణ, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్​ ఏసీపీ శివమారుతి, సైబరాబాద్ సీటీసీ ఏసీపీ ఆశల గంగారాం, విజిలెన్స్, ఎన్​ ఫోర్స్​ మెంట్​ డీఎస్పీ రవికుమార్​ రెడ్డి, ఈగిల్​ ఫోర్స్​ డీఎస్పీ బచ్చలకూర రమేశ్​, సీఐడీ సంగారెడ్డి డీఎస్పీ బి.శ్రీనివాస రావు మెరిటోరియస్​ సర్వీస్ మెడల్స్ తీసుకోనున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో ఘోరం.. బ్లింకిట్ డెలివరీ బాయ్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

వీరితో పాటు కొండాపూర్​ టీజీఎస్పీ 8వ బెటాలియన్​ అసిస్టెంట్​ కమాండెంట్ డీ.సత్యనారాణ, సైబరాబాద్​ ఎకనమిక్​ అఫెన్సెస్ వింగ్​ సీఐ పీ.జగదీశ్వర్​, ఆక్టోపస్​ హెడ్​ కానిస్టేబుల్​ సీ.రాములు, హైదరాబాద్ పీటీవో హెడ్​ కానిస్టేబుల్ కూరపాటి తిరుపతి రాజు, గ్రేహౌండ్స్​ హోంగార్డు మేడిపల్లి యాదయ్య సైతం మెరిటోరియస్​ సర్వీస్ మెడల్​ అందుకోనున్నారు. ఇక గ్రేహండ్స్ కానిస్టేబుళ్లు బీ.సత్యారావు, సందీప్​ కుమార్​, జే.వంశీకృష్ణ గ్యాలంట్రీ మెడళ్లను అందుకోనున్నారు.

Advertisement

Also Read: కాలిఫోర్నియా అందాల మధ్య మమతా మోహన్‌దాస్.. ఫొటోలు అదుర్స్!

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×