E-Paper
Advertisement

కల్యాణలక్ష్మి కాస్త సంతానలక్ష్మిగా మారిందా.. కాంగ్రెస్ పై కల్వకుంట్ల సంజయ్ ఫైర్!

కల్యాణలక్ష్మి కాస్త సంతానలక్ష్మిగా మారిందా.. కాంగ్రెస్ పై కల్వకుంట్ల సంజయ్ ఫైర్!
Advertisement

Congress Criticism: స్వేచ్చ బ్యూరో: కాంగ్రెస్ అంటేనే స్కామ్ అని, పింఛన్లు ఇవ్వడానికి పైసలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్ అంటే అస్తిత్వంఅని, భవన్ నిర్మాణం చేసి 20 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు,చేతబడులు అంటూ చెత్తబుద్ధిని బయట పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నవీన యుగంలో,సైన్స్ యుగంలో క్షుద్ర ద్ర భాష మాట్లాడుతున్నారన్నారు. విద్యార్థులకు,భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు.

బీడీ కార్మికులకు పింఛన్..

ఆలోచనలో, భాషలో కుటుంబ సభ్యులు మార్పు తీసుకురావాలన్నారు. కొత్త పింఛన్ దరఖాస్తులో బీడీ కార్మికుల కాలమ్ పెట్టలేదని, ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు బీడీ కార్మికులను పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చారన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎక్కువ మంది బీడీ కార్మికులు ఉంటారని, ఆకార్మికులకు ఉన్న పింఛన్లు తీసివేస్తారా? అందాల పోటీలకు పెట్టిన ఖర్చు బీడీ కార్మికులకు సంవత్సరం పాటు పింఛన్లు ఇవ్వొచ్చు అన్నారు. కేసీఆర్ 45 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. కేసీఆర్ కిట్ ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసివేశారని అన్నారు.

Advertisement

Also read: ఫ్రిజ్‌లో పెట్టిన పిండి వాడకూడదా? నిపుణులు ఏం చెబుతున్నాంటే?

పార్లమెంట్‌లో..

కల్యాణలక్ష్మీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకివచ్చాక సంతాన లక్ష్మీ పథకంగా మారిందన్నారు. పెండ్లప్పుడు ఇవ్వాల్సిన కల్యాణ లక్ష్మి చెక్ ను పిల్లలు పుట్టాక ఇస్తున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానని చెప్పిన కాంగ్రెస్ కనీసం 2,000 రూపాయలు ఇవ్వడం లేదన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ మాట ఎవరైనా ఎత్తుతున్నారా?బీజేపీ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 8 మంది లోక్ సభ ఎంపీలు ఉన్నారు. అయినా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. పబ్లిసిటీ కి పెట్టే ఖర్చుతో కొన్నేళ్లు పెన్షన్లు ఇవ్వొచ్చు మూడు లక్షల పెన్షన్లు కత్తిరించి రెండు లక్షలే కొత్తగా ఇస్తారా? అనని నిలదీశారు. సమావేశంలోకార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి పాల్గొన్నారు.

Advertisement

Also Read: రైతులు, ఆటో డ్రైవర్లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×