E-Paper
Advertisement

Prabhas: AI ట్రెండ్ మధ్యలో రియల్ ఫోటో.. హీరోయిన్ తో హార్ట్ సింబల్ పెట్టిన ప్రభాస్..!

Prabhas: AI ట్రెండ్ మధ్యలో రియల్ ఫోటో.. హీరోయిన్ తో హార్ట్ సింబల్ పెట్టిన ప్రభాస్..!

Prabhas Nidhi Aggarwal: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చిన్న విషయం బయటికి వచ్చినా అది పెద్ద వార్తగా మారిపోతుంది. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన నిలబడి ఉన్న ఒక్క ఫోటో అయినా..ఓ చిన్న అప్డేట్ అయినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంది. ఇటీవలి కాలంలో అయితే అభిమానులు ప్రభాస్ ఫోటోలను ఏఐ (AI) టెక్నాలజీతో తయారు చేసి..హీరోయిన్లతో కలిపి పోస్ట్ చేయడం కూడా ఎక్కువైంది. అందుకే ఇప్పుడు రియల్ ఫోటో ఏది.. ఏఐ ఫోటో ఏదో గుర్తించడం చాలా కష్టం అయిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నటి నిధి అగర్వాల్ షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఇద్దరూ క్యూట్‌గా ఫింగర్ హార్ట్.. సింబల్ చూపిస్తూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటో చూసిన వెంటనే అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే నిధి ఈ ఫోటోకు పెట్టిన క్యాప్షన్ మరింత ఆసక్తి కలిగించింది. ఆమె స్పష్టంగా “This is not AI” ..అని రాసింది.

నిధి అగర్వాల్ త్వరలో ప్రభాస్ సరసన ది రాజా సాబ్ సినిమాలో నటించనుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసిన సహజమైన ఫోటోలా కనిపించడంతో.. చాలామంది అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే “This is not AI” అనే క్యాప్షన్ వల్ల ఈ ఫోటో చుట్టూ కొద్దిగా గందరగోళం కూడా చుట్టుకుంది. ఈ మధ్య ఏఐతో చేసే ఫోటోలు చాలా రియల్‌గా ఉండటంతో..నిజమైన ఫోటోకే కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. “ఇప్పుడు ఏది నిజమో, ఏది ఏఐనో అర్థం కావడం లేదు” అని చాలామంది అంటున్నారు

ఇక వీళ్లిద్దరూ నటించిన రాజా సాబ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రంలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లు.. రిధి కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక నిధి అగర్వాల్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ షూటింగ్ సమయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. ముఖ్యంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని తెలిపింది. పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారమే ఎక్కువగా తీసుకుంటారని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటారని చెప్పింది.

అలాగే ది రాజా సాబ్ కోసం ప్రభాస్ బాగా బరువు తగ్గారని.. అది ఆయన కష్టానికి నిదర్శనం అని నిధి ప్రశంసించింది. ఫిట్‌నెస్ విషయంలో ఆయన ఎంత సీరియస్‌గా ఉంటారో ఇది చూపిస్తుందని చెప్పింది. చివరగా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ఆయనకు సూపర్ పర్సనాలిటీ ఉందని, పొడవైన ఎత్తు, ప్రశాంతమైన స్వభావం కలిసి స్క్రీన్‌పై ప్రత్యేకమైన ఆరాను తీసుకువస్తాయని నిధి పేర్కొంది.

ALSO READ: Prabhas: రాజా సాబ్ సినిమా నుండి పెద్ద ట్విస్ట్ రివీల్ చేసేసిన మారుతి.. షాక్ లో ఫ్యాన్స్..

Related News

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×