E-Paper
Advertisement

తోటి మహిళా ఆఫీసర్‌పై వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్!

తోటి మహిళా ఆఫీసర్‌పై వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్!
Advertisement

IPS Trainee Arrest: తోటి ట్రెయినీ ఐపీఎస్​ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఉదయ్​ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పక్కాగా సేకరించిన సమాచారంతో అతన్ని నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీసు స్టేషన్ కు ఆయన్ను తరలించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లోని సర్ధార్​ నేషనల్ వ​ల్లభాయ్​ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్​ ట్రెయినింగ్ లో ఉన్నాడు. కాగా ఇదే అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ఐపీఎస్​ ట్రెయినీ.. ఇటీవల ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఉదయ్​ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపించారు. ఈ మేరకు అత్తాపూర్​ పోలీసులు ఉదయ్​ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.

Advertisement

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న నేషనల్ పోలీస్ అకాడమీ ఉన్నతాధికారులు ప్రివిలేజ్​ కమిటీతో విచారణ జరిపించారు. దీంట్లో ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్టుగా ప్రివిలేజ్​ కమిటీ నివేదిక ఇచ్చింది. దాంతో ఉదయ్​ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్​ చేస్తూ అకాడమీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత ఎర్రగడ్డ ప్రాంతంలో ఉంటున్న సోదరుని ఇంటికి వెళ్లిన ఉదయ్​ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు.

ఆపై తనపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ను కొట్టివేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్​ కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తయ్యే వరకు తనను అరెస్ట్​ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే, దీనికి హైకోర్టు నిరాకరించింది. అప్పటి నుంచి ఉదయ్​ కృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మిర్యాలగూడలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ తరలించారు.

Advertisement

Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

అంతకు ముందు ఉదయ్​ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. తానెక్కడికి పారిపోలేదని సొంతూరు ఊళ్లపాలెంలోనే ఉన్నానని తెలిపారు. చట్టాల మీద తనకు నమ్మకం ఉందన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. తన నాయనమ్మ ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో సొంతూరుకు వచ్చినట్టు స్పష్టం చేశారు. త్వరలోనే విచారణాధికారులను కలిసి నిర్దోషినని నిరూపించుకుంటానని అన్నారు.

Also Read: జియో యూజర్లకు పండగే.. ఒక్క రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. టీవీలో కూడా చూడొచ్చు!

Related News

మహబూబాబాద్‌ జిల్లాలో హైటెన్షన్.. పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం!

అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఏపీ ఫీజు బకాయిలపై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్!

ఎంతటి వారినైనా.. అస్సలు వదిలిపెట్టం.. హైడ్రా వివాదంపై సీఎం క్లారిటీ!

శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీపై కీలక చర్చ!

తెలంగాణ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. టీవీ ఆర్టిస్టులకు ‘సర్కార్ బంపర్ ఆఫర్!

Big Stories

Advertisement
×