E-Paper
Advertisement

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?
Advertisement

2B Bar Licences: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యూర్ పరిధిలో 14 మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో 27 (2బీ) బార్లకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్ష రూపాయల రుసుముతో ఈనెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. క్యూర్ ఏర్పాటు, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా 2బీ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది.

14 బార్లకు..

క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని 14 బార్లకు సంబంధించిన దరఖాస్తులను అబ్కారీ భవన్ లోని కమిషనర్ కార్యాలయంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల దరఖాస్తులను ఆయా ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలతో పాటు కమిషనర్ కార్యాలయంలోనూ, డీపీఈఓ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. దరఖాస్తులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 లోపు ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Also read: ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

2బీ బార్లకు దరఖాస్తులు..

సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని అలియాబాద్ లో ఒకటి, మూడు చింతలపల్లి ఎల్లంపేట మున్సిపాలిటీలో రెండేసి 2బీ బార్లకు సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనూ, కుత్బుల్లాపూర్ డీపీఈవో కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. రంగారెడ్డి డిప్యూటీ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఫ్యూచర్ సిటీలో చేవెళ్ల మున్సిపాలిటీలో ఒకటి, మొయినాబాద్ మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పరిగి మున్సిపాలిటీలో, సంగారెడ్డి జిల్లాలోని గడ్డి పోతారం, కోహిర్ మున్సిపాలిటీలో ఒకటి చొప్పున, గుమ్మడాల మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు దరఖాస్తులను ఆహ్వానించారు.

అధికారిక వెబ్ సైట్..

Advertisement

ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, కల్లూరు, మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, మహబూబ్ నగర్, దేవరకద్ర, నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కామారెడ్డి జిల్లాలోని బిడ్డకుంట,వరంగల్ జిల్లాలో నర్సంపేట్, జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్, మహబూబాబాద్ జిల్లాలో కే సముద్రం, జయశంకర్ భూపాల జిల్లాలో ములుగు మున్సిపాలిటీలో కొత్త 2బీ బార్లకు దరఖాస్తులను ఆహ్వానించారు. క్యూర్ పరిధిలోని 2బీ బార్లకు 44 లక్షలు, నిజామాబాద్ జిల్లా బోధన్ బార్ కు 42 లక్షలు మిగిలిన 2బీ బార్లకు 30 లక్షలు సంవత్సరానికి ఎక్సైజ్ ఫీజుగా కట్టాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం tgbcl. telangana. gov. in వెబ్ సైట్ ను సందర్శించ వచ్చని పేర్కొన్నారు.

Also read: బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×