E-Paper
Advertisement

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!
Advertisement

Fish Seed: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, కులవృత్తులకు మహర్దశ కల్పించడంలో ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని జలాశయాలు, చెరువులను మత్స్య సంపదతో కళకళలాడించేలా ప్రతిష్టాత్మకమైన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం వనపర్తి జిల్లాలో రాష్ట్ర మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

జల వనరులకు జీవం పోసేలా.

వర్షాకాలం జోరుగా సాగుతుండటంతో రాష్ట్రంలో ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు నీరు చేరింది. ఈ తరుణంలో నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోని ప్రధాన జలాశయాల్లో మంత్రి వాకిటి శ్రీహరి చేప పిల్లలను వదలనున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గ పరిధిలోని నీటి వనరులకు పారదర్శకంగా చేప పిల్లలను చేరవేయడం. స్థానిక మత్స్యకార సహకార సంఘాల సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ‘టీ-మత్స్య’ యాప్ ద్వారా రవాణా పంపిణీ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించనున్నారు.

Advertisement

Aklso read: వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం: మంత్రి వాకిటి శ్రీహరి

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం మత్స్యకార కుటుంబాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కేవలం చేప పిల్లల విడుదలకే పరిమితం కాకుండా, ఉత్పత్తి అయిన మత్స్య సంపదను స్థానికంగా విక్రయించుకునేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యేక మార్కెట్లు, స్టాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు . నేడు వనపర్తిలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఊపందుకోనుండటంతో మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Also read: ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

 

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×