E-Paper
Advertisement

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?
Advertisement

Chakali Ailamma: స్వేచ్చ బ్యూరో: బడుగు, బలహీన వర్గాల్లో జన్మించి నాటి అన్యాయాలను ధిక్కరించి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో మహిళలంతా సంఘటితమై గ్రామాల్లో బెల్ట్‌షాపులను నిర్మూలించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వీరనారి ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రాజ్‌గోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ నాటి సామాజిక అన్యాయాలను ఎదురించి చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి మహిళలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

డిండి ప్రాజెక్టుపైనే దృష్టి..

Advertisement

మునుగోడు ప్రాంతం గత కొన్నేళ్లుగా సాగునీటి వసతి లేక ఎడారిని తలపించే పరిస్థితుల్లో ఉందని రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం శివన్నగూడెం రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తామని శంకుస్థాపన చేసి పనులను మధ్యలోనే నిలిపివేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిండి ప్రాజెక్టు నుంచి మునుగోడు ప్రాంతానికి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డితో పలుమార్లు మాట్లాడినట్లు తెలిపారు. నకిరేకల్‌లో జరిగిన సభ సందర్భంగా సీఎంతో ఇదే అంశంపై మాట్లాడి, ఆయన అంగీకరించిన తర్వాతే తాను శాలువా కప్పానని వివరించారు.

Also read: కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

మంత్రి పదవి..

Advertisement

తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రి పదవి కోసం కలుస్తున్నానంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని రాజ్‌గోపాల్‌రెడ్డి ఖండించారు. మంత్రి పదవి తనకు ఇవ్వాలా వద్దా అన్నది ముఖ్యమంత్రి పరిధిలో మాత్రమే లేదని, కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తే రేవంత్‌రెడ్డితో పాటు అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ, మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసమే ఇక్కడి నుంచి పోటీ చేశానని ఆయన తెలిపారు.

రెండేళ్లలో సమస్యల పరిష్కారమే లక్ష్యం

నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో, స్థానిక ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పనిచేస్తామని రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పారు. పదవీకాలంలో మిగిలిన రెండేళ్లను సమర్థవంతంగా వినియోగించుకుని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Also read: వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!

Tags

Related News

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Big Stories

Advertisement
×