E-Paper
Advertisement

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!
Advertisement

Fake Currency: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న వ్యక్తిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ కు చెందిన విక్రమ్ (21) కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చి బేగంబజార్ ప్రాంతంలో స్థిరపడ్డాడు.

అశోక్ అనే వ్యక్తితో..

అదే ప్రాంతంలోని బాలాజీ డెకర్స్ లో పని చేస్తున్నాడు. ఇక్కడ విక్రమ్‌కు అశోక్ అనే వ్యక్తితోపాటు మరికొందరు పరిచయం అయ్యారు. అశోక్ ఇంతకుముందు నుంచే నకిలీ నోట్ల చలామణి చేస్తూ వస్తున్నాడు. అది చూసి విక్రమ్ కూడా ఈ దందా మొదలు పెట్టాడు. అశోక్ నుంచి నకిలీ నోట్లు తీసుకుని చలామణి చేస్తున్నాడు.

Advertisement

Also read: కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

అనుమానాస్పదంగా..

బేగం బజార్ ఛత్రీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఏఎస్ఐ జనార్దన్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ సంజయ్ కుమార్ శర్మలకు విక్రమ్ అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చెయ్యగా అతని వద్ద 16నకిలీ 5వందల రూపాయల నోట్లు దొరికాయి. విచారణలో అశోక్ నుంచి వాటిని తీసుకుని షాపుల్లో మారుస్తున్నట్టు విక్రమ్ వెల్లడించాడు. ఈ మేరకు అతనిపై కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేశారు. పరారీలో ఉన్న అశోక్ తదితరుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Also read: మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Tags

Related News

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Big Stories

Advertisement
×