E-Paper
Advertisement

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!
Advertisement

HCA Row: బీసీసీఐ అంబుడ్స్ మన్ నిబంధనల ఉల్లంఘనలపై హెచ్సీఏకు ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి తెలిపారు. మెరిట్ ఆధారంగా విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసిందన్నారు. హెచ్సీఏలోని 217 మంది ఓటింగ్ సభ్యుల్లో 209 మంది కేవలం హైదరాబాద్ నగరానికే చెందిన వారే ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడినా క్రికెట్ పాలన ఇప్పటికీ హైదరాబాద్‌ కే పరిమితం కావడంపై బీసీసీఐ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ, జిల్లా స్థాయి క్రీడాకారుల ప్రతిభకు, మౌలిక వసతులకు తగిన అవకాశాలు కల్పించాలన్నారు.

క్లబ్ సభ్యత్వాలపై ప్రశ్నలు..

సికింద్రాబాద్ క్లబ్, ఫతే మైదాన్ క్లబ్ వంటి వాటికి పూర్తి సభ్యత్వాలు, ఓటింగ్ హక్కులు ఏ ప్రాతిపదికన దక్కాయనే దానిపై హెచ్సీఏ రికార్డులతో వివరణ ఇవ్వాలన్నారు. హెచ్సీఏ వ్యవహారాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిల్ లు, రిట్ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు న్యాయం జరిగే వరకు చట్టపరమైన వేదికలపై టీసీఏ పోరాటం చేస్తుందన్నారు.

Advertisement

Also read: హైదరాబాద్ సైబర్ క్రైమ్.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కే రూ. 14.61 కోట్ల టోకరా!

Tags

Related News

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!

Big Stories

Advertisement
×