Jeevan Reddy: స్వేచ్ఛ బ్యూరో : మూడేళ్ళుగా కాళేశ్వరం ప్రొజెక్టు మూడు బ్యారేజీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న మరమ్మత్తులు కూడా చేయలేకపోయిందని మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి టి .జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతోటి సాగునీరు తాగునీరు విద్యుత్ కొరతతో రైతాంగం ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవకాశం లేక కాదు అవకాశం ఉండి కూడా మనం ఉపయోగించుకోవడం లేదని, నది జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని, ప్రాణహిత నది జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించిందని, వారు స్పష్టంగా పేర్కొన్నారు.
తక్షణమే కన్నెపల్లి పంప్‌హౌస్ స్టార్ట్ చేయండి..
కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నది జలాలను ఎత్తి అన్నారం సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి కి ఎత్తిపోయవచ్చు.. ఎల్లంపల్లి కూడా 20 టీఎంసీల తో నిండుకుండలా ఉందన్నారు. ఎల్లంపల్లి నుంచి, దిగవ కు విడుదల చేయడం ద్వారా మనం పైకి ఎత్తిపోసుకోవచ్చు.. కెసిఆర్ దూరదృస్థితో గ్రావిటీ కేనాల్స్ కట్టారు.. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పి కి ఎత్తి పోసే విధంగా పంపింగ్ సిష్టాన్ని రూపొందించారు.. ఎస్సారెస్పి లో 46 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి .. ఖరీఫ్ పంటకు నీళ్లు వినియోగించుకోలేకపోతున్నాము..సెకండ్ క్రాఫ్ కు నీళ్లు ఇవ్వాలంటే దిగువ నుండి నీళ్లు ఎత్తిపోసుకుని ఎస్ ఆర్ ఎస్ పి నిలువ సామర్థ్యాన్ని నింపుకుంటే గాని సాధ్యం కాదు. ఈరోజు ఆ అవకాశాలు ఉన్నాయన్నారు.. అన్ని అవకాశాలు ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మొత్తం తెలంగాణ ప్రాంతానికి శనిలా దాపరించారు. మీరు చెప్తున్న తుమ్మిడి హట్టి నుండి నీళ్లను తరలిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు.
మూడు సంవత్సరాలు గడిచాయి .. మూడు బడ్జెట్లు అయిపోయాయి
మూడు సంవత్సరాలు గడిచాయి .. మూడు బడ్జెట్లు అయిపోయాయి.. ఇప్పటివరకు ఆలు లేదు సూలు లేదు.. ఏమైందంటే మేము మహారాష్ట్ర తోని మాట్లాడుతున్నామంటున్నారు..ఆనాడు యూపీఐ ప్రభుత్వంలో సోనియా గాంధీ చైర్ పర్సన్ గా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కేంద్రంలో మహారాష్ట్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మీరు ఒప్పందం కుదుర్చుకోలేదు.. తెలంగాణ ఏర్పడ్డాక కెసిఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఉత్తర దక్షిణ తెలంగాణలో సస్యశ్యామలం చేయాలంటే ప్రాణహిత నది జలాలను ఉపయోగించుకున్న నాడే సాధ్యమవుతుందని భావనతో మహారాష్ట్ర 148 టీఎంసీల కు పట్టుబట్టడంతో మేడిగడ్డ వద్ద ఇంకో 100 మీటర్లు ఎత్తుతోని ఒప్పందం చేసుకుని మన రాష్ట్రానికే తలమానికంగా కాలేశ్వరాన్ని నిర్మించారన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. లక్ష కోట్లతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులో మేడిగడ్డ విలువ 4000 కోట్ల అయితే అందులో ఈ బ్లాక్ విలువ 600 కోట్లు వస్తది..కుంగిపోయినవి 200 కోట్ల విలువ వస్తది. అంటే 0.2 % డామేజ్.. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవండి…ఈ నెల 30 న సిరిసిల్ల పోతానంటున్నావ్ . సంతోషం సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల కూడా కాలేశ్వరం లో భాగమే, ఎస్సార్ ఎస్పి ద్వారా సాగునీరు ఇవ్వు ముందు…కన్నేపల్లి నుండి నీరును ఎగువకు ఎత్తిపోసి శ్రీరాంసాగర్ తరలింప చేయగలిగినట్టయితే రబికి సాగు నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది.. ఉత్తంకుమార్ రెడ్డి సన్నాయి నొక్కుడు నొక్కుడు కాదు..రిపోర్ట్ వచ్చి రెండు మాసాలు అయినా నవంబర్లో స్టార్ట్ చేస్తారంట.. 2027 వర్షాకాలంలో పూర్తి చేస్తారంట.. మూడేళ్లు గడిచింది.
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు!
ఇంకో నాలుగొద్దులు అయితే మీరు దిగిపోయే సమయం వచ్చింది.. మీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అందరికీ అర్థమయ్యింది.. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోండి.. నీళ్ల సదుపాయం లేకుంటే కరువు అనుకుంటాం కానీ ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్ ఈ కరువు తెచ్చింది.. ఇది కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు.. లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్న మీలో చలనం లేదు.. ప్రజలకు కూడా అర్థం అయ్యింది.. మేడిగడ్డ మరమ్మత్తులు చేయడానికి సమయం పడుతుంది కానీ అన్నారం సుందిళ్ల నుండి నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు.. తక్షణమే నీళ్లను ఎత్తిపోయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
Also Read: మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!