E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: కవిత కొత్త పార్టీ వెనక అసలు సంగతి ఇదేనా.. టార్గెట్ ఆ నలుగరేనా..?

Kalvakuntla Kavitha: కవిత కొత్త పార్టీ వెనక అసలు సంగతి ఇదేనా.. టార్గెట్ ఆ నలుగరేనా..?
Advertisement

Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కవిత చాలా వేగంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే కవిత సొంత జిల్లాలో తన రాజకీయంగా పేరు తెచ్చిన జిల్లా అయినా నిజామాబాద్ అడ్డాగా ఆమె పెట్టబోయే పార్టీకి మొదటి అడుగు పడనుందట. వచ్చే శ్రీరామ నవమిన రోజు నిజామాబాద్ జిల్లా నుంచి పార్టీ పేరు అనౌన్స్ మెంట్ చేయబోయే తేదీని ప్రకటించనుంది. ఆమె ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ అని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పొలిటికల్ పార్టీని ఆమె ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఈ పార్టీ పేరిట రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఆదిశగా పార్టీ కి సంబంధించిన పనులు ముందుకు సాగుతున్నాయి. ఎక్కడి నుంచి పార్టీ అనౌన్స్ మెంట్ డేట్ ఉండటంతో తెలంగాణ జాగృతి భారీ ఏర్పాట్లు చేరినట్లు తెలుస్తుంది.

వారి ఆశీర్వాదంతో..

తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అలవర్చుకొని ఒక బలమైన నేతగా సొంత ఊరు లో నిలబడ్డారు కవిత, ఎంపీ గా ఎమ్మెల్సీ గా ఉమ్మడి జిల్లాకు దిక్సూచిగా నిలిచారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి జైలు గోడలపై రాసిన స్థలం ఇప్పుడు శ్రీ రఘునాథ ఆలయం జిల్లా రామమందిర్ లో ఈ నెల 27 న సీతారాముల కళ్యాణంలో కవిత ఆమె భర్త అనిల్ ఇద్దరు పాల్గొంటున్నారు. సీతారాముల కళ్యాణం అనంతరం వారి ఆశీర్వాదంతో అక్కడే కవిత పెట్టబోయే కొత్త పార్టీ ప్రకటన తేదీ నీ అక్కడి నుంచి అనౌన్స్ మెంట్ చేయనున్నారట. ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవిత అనుచర వర్గం, జాగృతి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కోసం ఎదురు చూస్తుంటే సొంత జిల్లా అయిన నిజామాబాద్ లో ఆమె పార్టీ కోసం ఆమె కోసం పెద్ద ఎత్తున బీ ఆర్ ఎస్ నుంచి కవిత పార్టీలోకి రానున్నట్లు ఎప్పటి నుంచో జోరుగా జరుగుతున్న చర్చా. ఇప్పటికే చాలా మంది మాజీ ఎంఎల్ఏ లు, జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఆమె వల్ల రాజకీయంగా లబ్ధి పొందిన వారు ఎప్పుడు పార్టీ అనౌన్స్ మెంట్ కోసం వేటింగ్ అంటున్నారట.

Advertisement

Also Read: Petrol Shortage: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. డబ్బాలు, బాటిళ్లతో బంకుల వద్ద క్యూ.. యుద్ధం ఎక్కడో.. భయం ఇక్కడ!

ఆ నాలుగు దయ్యాలక..

ఇక సొంత జిల్లా పై కవిత స్పెషల్ ఇంట్రస్ట్ పెట్టారట. ఇక దానికి ఎందుకు ఆంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయి అనేది కవిత వర్గీయుల్లో జోరందుకున్న చర్చా. ఓటమి కావచ్చు దానికి సహకరించిన ప్రత్యేకంగా పని చేసిన నేతలు, మాజీ ఎమ్మెల్యే లు, పార్టీ నుంచి దూరం చేసేందుకు ఆ నాలుగు దయ్యాలకు జిల్లా నేతల సహకారం ఉంది అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చరట కవిత. ఇక పార్టీ అనౌన్స్ మెంట్ తరువాత ఫస్ట్ జిల్లా నుంచే కవిత అనుకున్న వారే నెక్స్ట్ టార్గెట్ అంటూ అంటూ కవిత అనుచర వర్గం తో పాటు పార్టీలో రేపు కవిత తో కలిసిపోయే క్యాడర్, లీడర్ లో మాత్రం మనసులో ఒక రకంగా చెప్పాలంటే 10 థౌసెన్డ్ వాల పేల్చినత సంతోష పడుతున్నారట. మొత్తానికి కవిత మాత్రం సీతారాముల కళ్యాణం రోజు పార్టీ అనౌన్స్ చేసే డేటు ప్రకటిస్తారని తెలుస్తుంది.

Advertisement

Also Read: Congress : జీవన్ రెడ్డి గుడ్ బై..కాంగ్రెస్‌కు ప్లస్సా.. మైనసా?

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×