Kavitha: ఏదో విషయంపై నిత్యం వార్తల్లో ఉంటున్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. అంశం ఏదైనా సమయానుకూలంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా బ్యాంకు ఉద్యోగుల పని దినాలపై నోరు విప్పారు. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై కేంద్రం తక్షణం స్పందించి వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అన్నివర్గాల ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. సమయం, సందర్భం వచ్చిన వారి సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై నోరు విప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. అధిక పనిభారంతో సతమతమవుతున్నారు బ్యాంకు ఉద్యోగులు. ఐదు రోజుల పని దినాల డిమాండ్ అమలు కోసం వారు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారు.
ఉద్యోగులపై అధిక పనిభారం-టీఆర్ఎస్
కానీ కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లను డీల్ చేయడం, బ్యాక్ ఎండ్ వర్క్, కరెన్సీ లెక్కలు చూసుకోవడంలో రోజంతా గడిచిపోతుందని రాసుకొచ్చారు. చాలామంది ఉద్యోగులు రాత్రి తొమ్మిది, పది గంటల వరకు పని చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరగడం, ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు బ్యాంకులకు రావడం తగ్గిందని పేర్కొన్నారు.
ఐయినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల పని భారం ఏ మాత్రం తగ్గలేదన్నారు. బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. ఇదేమీ కొత్త డిమాండ్ కాదన, వాస్తవానికి న్యాయమైనదేనని అన్నారు. చాలామంది బ్యాంకు ఉద్యోగులకు ఏం పని ఉంటుందని అంటారని వివరించారు.
ALSO READ: కాంగ్రెస్ గెలిస్తే ఓకే.. ఓడిపోతే EVMల తప్పా? రాహుల్ గాంధీకి బీజేపీ సూటి ప్రశ్నలు!
ఈ విషయంలో ప్రభుత్వం అనుకుంటే షిఫ్ట్ పద్దతిలో అమలు చేయాలన్నారు. ఈ మధ్యకాలం ఉద్యోగాల్లో ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఉద్యోగులు రాజీనామా చేసిన సందర్భాలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. బ్యాంకుల్లో వర్క్ పెరిగిందని, సిబ్బంది వెళ్లిపోవడం జరుగుతోందని, దీనివల్ల మిగతా భారమంతా ఉద్యోగులపై పడుతోందన్నారు
అధిక పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాల డిమాండ్ అమలు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.
ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లను డీల్ చేయడంతో పాటు, బ్యాక్ ఎండ్ వర్క్, టార్గెట్లు, కరెన్సీ లెక్కలు చూసుకోవడంలో రోజంతా గడిచిపోతుంది. చాలామంది రాత్రి… pic.twitter.com/MQWdvPr8o8
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 6, 2026