Kavitha: బీఆర్ఎస్‌లో అంతర్గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా? కవిత ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందా? బుధవారం కవిత రియాక్షన్‌తో కొందరు నేతలు బట్టబయలు అయ్యారా? త్వరలో ఊహించని బాంబు పేల్చనున్నారా? రానున్న రోజుల్లో కొందరి నేతల గుట్టు బట్టబయలు చేస్తారా? ఆయా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
బీఆర్ఎస్ అంటే కవిత.. కవిత అంటే బీఆర్ఎస్ అనే విధంగా ముద్ర వేసుకున్నారు.ఆ పార్టీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ కూతురు కావడంతో ఆమెకి తెలీకుండా ఎలాంటి విషయాలు ఉండవు. కచ్చితంగా ఆమెలో చెవిలో పడాల్సిందే. మంగళవారం ఆమెని పార్టీ సస్పెండ్ చేసింది. దీనిపై అగ్గి మీద గుగ్గిలమైన కవిత, బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు.
ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్‌ను డిఫెండ్ చేస్తూనే కొందరి నేతల గుట్టును బయటపెట్టారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్‌రావు కీలకమంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు పార్టీని హస్తగతం చేసుకోవాలని ఊహరచన చేస్తున్నారని మరో బాంబు పేల్చారు. ఆ ప్రాజెక్టుపై అవినీతితో 2018 ఎన్నికల్లో రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారంటూ బాంబు పేల్చారు.
ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ విషయం చాలామంది నేతలకు తెలిసింది. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్‌రావు ఎలాంటి శాఖ కేటాయించలేదు. ఆ సమయంలో కేసీఆర్-హరీష్‌రావు మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. అది ఎంతవరకు నిజమనేది తెలీదు.
ALSO READ: నాన్న నువ్వ జాగ్రత్త.. కవిత ఎమోషనల్, కేటీఆర్-హరీష్‌రావులపై ఆగ్రహం
కాకపోతే ఖర్చు చేసిన నిధులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినవి ఎవరికీ తెలీదు. పదేళ్ల బీఆర్ఎస్ రూలింగ్‌లో కేవలం కాళేశ్వరం విషయాన్ని మాత్రమే కవిత బయటపెట్టారు. ఆ పార్టీ నేతలు చేసిన అవినీతి చేసిన డజనకు పైగానే నేతల చిట్టా కవిత వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, కొందరు నేతలు చేసిన అవినీతి చిట్టా ఆమె వద్ద ఉన్నట్లు ఓ వార్త పొలిటికల్ సర్కిల్స్ చకచకా తిరిగేస్తోంది. ఈ విషయం కొందరి కారు పార్టీ నేతల చెవిలో పడింది. ఇప్పుడు దానిపై ఆ పార్టీలో చర్చ మొదలైంది. కొందరి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కవిత మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి నేతల చిట్టా బయటపెడుతుందని, అప్పుడే మీడియా అటెక్షన్ ఉంటుందని అంటున్నారు. మరి బీఆర్ఎస్ నేతల అవినీతి వ్యవహారం ఓపెన్‌గా చెబుతారా? లేకుంటే మొన్నటి మాదిరిగా ఆఫ్ ద రికార్డులో చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కవిత పార్టీ పెడితే నేతల అవినీతి చిట్టా బయటపెట్టడం ఖాయమనే ఊహాగానాలు లేకపోలేదు. మొత్తానికి అధికార పార్టీ కంటే.. కవిత అంటే ఇప్పుడు బీఆర్ఎస్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది.