Hyderabad: బీఆర్ఎస్ రూటు మార్చిందా? ప్రశ్నించి వాళ్లను టార్గెట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుందా? అందుకు సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా చేసుకుందా? దీంతో ప్రత్యర్థులపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందా? ఈ క్రమంలో కీలక విషయాలు బయటపెట్టారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత.
బీఆర్ఎస్ పార్టీ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. ప్రశ్నించిన వాళ్లను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో బిగ్‌టీవీ లోగో మాదిరిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకర పోస్టులు చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. గతంలో ఆమెపై కూడా ఇదే విధంగా ప్రచారం చేశారు. BRS సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఒకానొక దశలో కల్వకుంట్ల కవిత కొన్ని నిజాలు బయటపెట్టారు.
తల్లి-చెల్లి అనేది మరిచిపోయి నా ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో నన్ను అడ్డగోలుగా తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. నువ్వు తిట్టిస్తే నేను భయపడనంటూ సూటిగా కౌంటరివ్వడంతో ఆనాటి నుంచి కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. నిర్మాణ సంస్థతో చేసిన అక్రమ దోపిడీల గురించి భయపడకుండా ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె తేల్చేశారు.
మీకు కూడా పిల్లలు, తల్లి ఉందన్న విషయం మరిచిపోవద్దని ఒకానొక దశలో ఘాటుగా హెచ్చరించారు కవిత. మర్యాద అనేది ఉంటుందని, సభ్యత-సంస్కారం ఉండాలన్నారు. ఏకంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాను హెచ్చరించారు. దమ్ముంటే ఇష్యూపై మాట్లాడాలని, ఆడపిల్ల రాజకీయాలు చేస్తుంటే.. గుంటనక్కలు, దున్నపోతుల్లా అడ్డుపడతారా అంటూ చీల్చిచెండారారు.
ALSO READ: ఆడవాళ్లపై ఇంత నీచ రాజకీయమా? కేటీఆర్.. ఇదేనా మీ సంస్కారం?!
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన ఒక పార్టీ, సోషల్ మీడియాను ఇంత నీచంగా వాడుకుంటుందా? అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గలీజు సోషల్ మీడియా వల్లే బొక్క బోర్లా పడినా సిగ్గు రాలేదా? అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. చెప్పేవి నిజాలైతే దాగుడు మూతలు ఎందుకని మండిపడుతున్నారు బిగ్ టీవీ అభిమానులు. దుబాయిలో కూర్చొని హైదరాబాద్‌లో బురద జల్లుతారా?దొంగ మొహాలతో ఇంకెంత కాలమని రుసరుసలాడుతున్నారు.