Yuzvendra Chahal On Kuldeep : టీమిండియా ఒకప్పటి స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్..కుల్దీప్ యాదవ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఒక వెలుగు వెలిగిన చాహల్, తన కెరీర్ నాశనానికి కారణం కుల్దీప్ యాదవ్ అంటూ హాట్ కామెంట్స్ చేసినట్టు ఓ పోస్ట్ వైరల్ గా మారింది. కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav) కంటే, తానే గొప్ప స్పిన్నర్ అంటూ వ్యాఖ్యానించిన యుజేంద్ర చాహల్, రీ ఎంట్రీ కోసం వెయి కళ్లతో ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క మ్యాచ్ అయినా ఆడి, రిటైర్మెంట్ ఇవ్వాలనేది తన డ్రీమ్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో కుల్దీప్ యాదవ్ పై యుజేంద్ర చాహల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
జతిన్ సప్రూ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూలో టీమిండియా ఒకప్పటి స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ పాల్గొని, తన కెరీర్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ సమయంలో తనకు ఎక్కువగా అవకాశాలు వచ్చేవన్నారు. రోహిత్ శర్మ కూడా తనకు ఎక్కువగానే అవకాశాలు ఇచ్చారని యుజేంద్ర చాహల్ గుర్తు చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav), తాను ఒకప్పుడు ప్రత్యర్థులను వణికించేవాళ్లమన్నారు.
లెఫ్ట్ అండ్ రైట్ ఆర్మ్ కాంబినేషన్ ను అప్పట్లో టీమిండియా యాజమాన్యం కూడా బాగానే వాడుకుందని వెల్లడించారు. అయితే, తనకు ఇప్పుడు అవకాశాలు రాకుండా కొందరు కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు. దేశవాళీ, ఐపీఎల్ లో బాగా రాణించినప్పటికీ బీసీసీఐ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ కంటే, తానే గొప్ప బౌలరన్నారు. అయినా అతడికి అవకాశాలు ఇస్తూ, తనకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ కంటే, తానే గొప్ప ప్లేయరనే విషయాన్ని సెలక్టర్లు గమనించడం లేదని మండిపడ్డారు.
టీమిండియాలో ఛాన్సుల కోసం ఎదురు చూస్తోన్న యుజేంద్ర చాహల్ ( Yuzvendra Chahal), ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మాత్రం ఇరగదీస్తున్నాడు. మొదట్లో ముంబై ఇండియన్స్ కు ఆడిన యుజేంద్ర చాహల్, ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఇరగదీస్తున్న యుజ్వేంద్ర చాహల్ ను చివరి వేలంలో పంజాబ్ కింగ్స్ భారీ ధరకే కొనుగోలు చేసింది. రూ.18 కోట్లు పోసి మరీ కొనేసింది. ఒక ఇండియన్ స్పిన్నర్ ఈ స్థాయికి పలకడం ఇదే తొలిసారి.