Big Stories

KCR SURGERY Successful | కేసీఆర్‌కు హిప్ సర్జరీ విజయవంతం : యశోద ఆసుపత్రి వైద్యులు

KCR SURGERY Successful | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్జరీ పూర్తి అయ్యిందని.. కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబీకులతో పాటు.. ప్రభుత్వం కూడా ఆరా తీస్తూ వచ్చింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని గమనించేందుకు సీఎం రేవంత్‌.. ప్రత్యేక అధికారిని నియమించారు. మరోవైపు.. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోడీ. ఏపీ సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు.

- Advertisement -

ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్ లో ఉంటున్న కేసీఆర్ గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కాలు జారి కింద పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన మెడికల్‌ టీమ్‌.. ఆయన ఎడమ తుంటి ఎముక విరిగినట్లు నిర్ధారించారు. పరీక్షల అనంతరం ఆయనకు సర్జరీ చేశారు.

- Advertisement -

ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని…ఆయన కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో సర్జరీ చేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేసీఆర్‌కు ప్రమాదం జరిగిందని తెలియగానే స్పందించిన ప్రభుత్వం.. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్‌తో ఆయన్ను ఆస్పత్రికి తరలించింది.

సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి… యశోద హాస్పిటల్‌కు వెళ్లారు. వైద్యులను అడిగి KCR ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం KCR వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని… పార్టీ శ్రేణులెవరూ ఆందోళన చెందవద్దని మాజీ మంత్రి హరీష్‌రావు కోరారు.

KCR ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కవిత ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ ప్రమాదానికి గురికావడంపై మోడీ ట్వీట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఆయన ప్రమాదానికి గురికావడం చాలా బాధకరమని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై గవర్నర్‌ తమిళిసై, ఏపీ సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. మాజీ సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News