E-Paper
Advertisement

TS Highcourt : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

TS Highcourt : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement

TS Highcourt: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్‌ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వం వాదనలపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్‌ప్లాన్‌పై ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించగానే ఆ ప్రాంతంలో రైతులు ఆందోళనబాట పట్టారు. సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో రహదారులపై రాస్తోరోకో చేశారు. పట్టణానికి వచ్చే అన్నిదారులను మూసివేశారు. ఆ సమయంలో కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Advertisement

రైతుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గతంలో ప్రకటించారు. అలాగే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ లోనూ మాస్టర్ ప్లాన్ రద్దుపై తీర్మానం చేశారు. దీంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. మరి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ విషయంలో ఎలా ముందుకెళుతుందో చూడాలి. కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుందా? రైతులు డిమాండ్లను నెరవేర్చుతుందా?

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×