Komatireddy rajagopal reddy

Komatireddy rajagopal reddy: రాష్ట్రంలో బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమని,ఆ పార్టీ సభ్యులను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తాను ప్రజల కోసమే పార్టీలు మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే మరో పార్టీలో చేరానని చెప్పారు. పార్టీలు మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని విపక్ష సభ్యులపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంది. అభివృద్ధి పేరిట రూ.వేల కోట్లు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రతిసారీ పార్టీల మార్పుపై విమర్శలు చేస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన బంగ్లాలు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎలా వచ్చాయి?’’ అని ఆయన అని ప్రశ్నించారు.