E-Paper
Advertisement

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!
Advertisement

Cambridge University: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి ప్రముఖ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృంధం భేటి అయ్యింది. తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై ఈ భేటిలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.

కేంబ్రిడ్జ్ వర్గాలు సముఖత

ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందులో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ పిలుపుపై కేంబ్రిడ్జ్ బిజినెస్ ప్రతినిధి బృందం సుముఖత వ్యక్తం చేసింది. కేంబ్రిడ్జ్ మార్కెటింగ్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, ప్రొఫెసర్ వెంకట శిరీష్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరిచారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: సీఎం రేవంత్, ఉత్తమ్‌లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్

ఈ భేటిలో తెలంగాణ ప్రభుత్వం, కేంబ్రిడ్జ్ ప్రతినిధుల మధ్య కీలక అంగీకారం కుదిరింది. హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడం, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకరించడం వంటి అంశాల్లో భాగస్వామ్యానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూరుస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Also Read: జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీతలో రూ. 20 కోట్ల అక్రమాలు.. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్!

Tags

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×