Chinna Reddy: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి జి.చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. 1978లో ఇందిరా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేను నేటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావిస్తానని చిన్నారెడ్డి తెపారు.
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గేలు తనకు దేవుళ్లతో సమానమని వ్యాఖ్యానించారు.
స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ చేసారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో రెండేళ్ల ఎనిమిది నెలలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ జై కొట్టిందా?.. లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!
40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న నేతలు, కార్యకర్తల మనోభావాలను మాత్రమే వ్యక్తం చేశానని చిన్నారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం తనకు అలవాటు లేదని స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
Also read: సీఎం రేవంత్, ఉత్తమ్‌లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!