Surekha Reaction: రిపోర్ట్‌లో ఏముంది? వరంగల్ కాంగ్రెస్‌లో జరిగిన పంచాయితీ గాంధీ భవన్‌కు చేరుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షితో భేటీ అయ్యారు కొండా దంపతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ పరిణామాలపై… ఆమెకు నివేదిక సమర్పించారు. MLAలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డిపై మీనాక్షికి కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. తన మంత్రి పదవి పోతుందని అసత్యప్రచారం చేశారని, పార్టీ వ్యతిరేక సమావేశాలు నిర్వహిస్తున్నారని మంత్రి కొండా సురేఖ కంప్ల్లైంట్ చేశారు.
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్‌లో కీలక విషయాలను పొందుపరిచారు కొండా దంపతులు. తమపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇస్తూనే.. తమకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ ఉందని చెప్పారు. ఆ గ్రూప్ అంతా టీడీపీ నుంచి వచ్చిందని.. వారే కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తున్నారన్నారు. కడియం శ్రీహరి, గండ్ర, రేవూరి ప్రకాష్ రెడ్డిలది టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పారు. తమకు తెలియకుండా పోలీసులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.. ఆలయ కమిటీలు తమకు తెలియకుండా వేస్తున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేల గెలుపు కోసం కష్టపడ్డానని.. భవిష్యత్తులో కూడా కష్టపడతానన్నారు. తాను ఎవరికీ భయపడను.. భయపడలేదన్నారు కొండా మురళి.
ఈ భేటీ ముగిసిన అనంతరం కీలకవ్యాఖ్యలు చేశారు కొండా మురళి. తాను ఎవరికి భయపడేది లేదని మరోసారి తేల్చి చెప్పారు ఆయన. తాను వెనకబడిన వర్గాల ప్రతినిధిని అని.. ఒకరి గురించి కామెంట్ చేయనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బతికించడమే తన ఉద్దేశమన్నారు. అంతేకాదు పనిచేసే వాళ్లపైనే రాళ్లు విసురుతారంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడమే తన లక్ష్యమన్నారు ఆయన.
ఇక వరంగల్ గ్రూప్ రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. తాను ప్రజల గురించి తప్ప.. మరేవరి గురించి ఆలోచించనన్నారు ఆయన. తన వద్దకు రోజు చాలా మంది సాయం చేయాలని వస్తుంటారని తెలిపారు.
Also Read: శిద్దారాఘవరావు ఫ్యూచర్ ఏంటి?
ఇక పరకాల నుంచి కొండా దంపతుల కూతురు సుష్మిత పోటీ చేయడంపై కూడా కీలకవ్యాఖ్యలు చేశారు. ఎవరి ఆసక్తులు వారికి ఉంటాయని.. తమ కూతురిలో కూడా రాజకీయ రక్తమే ప్రవహిస్తోందన్నారు. దీనిపై తుది నిర్ణయం సుష్మిత, పార్టీ అధిష్టానానిదేనన్నారు కొండా దంపతులు.