Cab Driver: అసలే టెక్ యుగం.. ఏ తప్పు చేసినా కెమెరాకు చిక్కుతారు.. చిక్కుతాము కూడా. అలాంటి విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే సోషల్‌మీడియాలో బ్రతుకు బస్టాండ్ అవుతుంది. తాజాగా ప్యాసింజర్లు క్యాబ్‌లో ఉన్న అడ్డంగా వీడియోకు చిక్కారు. ఇంతకీ ఏ విషయం అనుకుంటున్నారా? వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్కేద్దాం.
ఎవరు.. ఏంటి.. ఎప్పుడు.. అనేది కాసేపు పక్కన బెడదాం. క్యాబ్ డ్రైవర్ తన కారులో అమర్చిన కెమెరా వ్యక్తుల ప్రవర్తనను బయటపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డ్రైవర్ అభ్యంతరం చెప్పినప్పటికీ కొంతమంది ప్యాసింజర్లు తమ పైత్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రతిదీ రికార్డ్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
క్యాబ్ డ్రైవర్లు తరచుగా ప్రయాణీకులతో గొడవ పడుతూ వార్తల్లో నిలుస్తారు. ఏమి జరిగినా చివరకు డ్రైవర్ దే తప్పని అంటుంటారు. ఓ క్యాబ్ డ్రైవర్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెబుతారు. టెక్నాలజీని తనకు అనుకూలంగా మార్చకున్నాడు. ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో అమర్చిన కెమెరాలో ప్రయాణికుల ప్రవర్తనను బయటపెట్టాడు.
రోడ్లు, పక్కన వెళ్తున్న బస్సును బట్టి ఈ వీడియో కోల్‌కతా నుండి వచ్చిందన్నది ఓ అంచనా. టాక్సీ లోపల కెమెరా ఎందుకు ఉండాలో క్యాబ్ డ్రైవర్ వివరించాడు. కారు లోపల మనకు కెమెరా ఎందుకు అవసరం అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో చూడండి అన్నాడు డ్రైవర్. కొంతమంది ప్రయాణీకులు క్యాబ్ ఎక్కారు.
ALSO READ: జూన్ 5న భారీ ప్రళయం.. ఆమె చెప్పింది, జరిగి తీరుతుంది
అందరూ ఫుల్‌గా డ్రింక్ చేస్తున్నారు. రాత్రివేళ కావడంతో కాసింత మద్యం పుచ్చుకున్నారు. ముందు సీట్లో కూర్చుని మద్యం తాగుతున్న ఒక వ్యక్తి క్యాబ్ కిటికీలోంచి రోడ్డుపై ఉన్న ఖాళీ బాటిల్‌ను విసిరేస్తున్నాడు. వాళ్లు దిగిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ ఏమన్నారంటే.. ఏమి చేసినా తాము చూస్తామని, పోలీసులు ఆందోళన చెందుతుంటే తాము ఇలాంటివి దాచిపెడతామని చెప్పుకొచ్చాడు. క్యాబ్ ల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది ఈ వీడియో.
This cab driver addressed privacy concerns in cabs which have dashboard cameras through this video.
He shouldn't have blurred the video though. Everyone should know who was this chutiya. pic.twitter.com/qmzDreMkgt
— Incognito (@Incognito_qfs) July 2, 2025