హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కమాండ్ కంట్రోల్ దగ్గర గౌరవ వందనం స్వీకరించి అనంతరం బాధ్యతలు చేపట్టారు. పలువురు పోలీస్ అధికారులు సీపీకి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటిసారి ప్రాధాన్యత ఉన్న పోస్టింగ్ దక్కింది. నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారిగా పేరు ఉంది.
కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. బోధన్ ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా, వరంగల్, మహబూబ్‌నగర్ ఎస్పీగా, గ్రేహౌండ్స్ కమాండెంట్‌గా, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా, కోస్టల్ సెక్యూరిటీ ఐజీగా, ట్రైనింగ్ ఐజీగా, గ్రేహౌండ్స్ ఐజీగా, ఆక్టోపస్ ఐజీ, ఏడీజీ గ్రేహౌండ్స్, ఏడీజీ ఆర్గనైజేషన్స్ పలు విభాగాల్లో విధులు నిర్వహించారు.