Hyderabad: హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ‘పారడైజ్’ సినిమా చూశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూశానని, చాలా బాగుందని చెప్పుకొచ్చారు. అణచివేతకు గురైనవారి అస్తిత్వ పోరాటానికి గొప్ప దృశ్య రూపంగా ఈ చిత్రాన్ని ఆయన వర్ణించారు. ఇంకా ఏమన్నారంటే..
నేచురల్ హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ద పారడైజ్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ ఓపెనింగ్ అందుకుంది. శనివారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఈ చిత్రాన్ని తిలకించారు. అణచివేతకు గురైనవారి అస్తిత్వ పోరాటానికి గొప్ప దృశ్య రూపంగా వర్ణించారు కేటీఆర్. చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూశానని, చాలా బాగుందని చెప్పారు.
చిత్రంలో నాని నటన ఆకట్టుకుందని కేటీఆర్ ప్రశంసించారు. ఎమ్మెల్యే శంకరన్న రూల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఆ పాత్ర స్ఫూర్తి ఏమిటో అందరికీ తెలుసని మనసులోని మాట వెల్లడించారు. సామాజిక అంశాన్ని తెరపై అన్ని కోణాల్లో ఆవిష్కరించారని చెప్పుకొచ్చారు. పాత్రల సంఘర్షణ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయన్నారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని, కథ-పాత్రలు- సన్నివేశాలను బాగుందన్నారు.
నాని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడని, పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని అన్నారు. మనుగడ కోసం సాగే పోరాటం, అణచివేత సమయంలో జరిగే పరిణామాలు, సమాజానికి గుర్తింపునిచ్చే నాయకుడి ఆవిర్భావం అద్భుతంగా ఆవిష్కరిస్తుందన్నారు. తెలంగాణ నేల, యాస, సంస్కృతిని అత్యంత సహజంగా ప్రతిబింబించే చిత్రంగా చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఒడెలతోపాటు, సోదరుడు నాని, చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు కేటీఆర్. సినిమాకు కేటీఆర్ రావడంతో ఈ విషయం ముందే తెలుసుకున్న అభిమానులు-ప్రేక్షకులు థియేటర్ వద్దకు భారీగా తరలివచ్చారు.
ALSO READ: ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 30 మంది ప్రయాణికులు, చౌటుప్పల్ వద్ద ఘటన
#WATCH | Telangana | Bharat Rashtra Samithi (BRS) Working President KTR, along with senior party MLAs and former ministers, watched a special screening of the latest film The Paradise, starring Nani and directed by Srikanth Odela, at Sudarshan Theatre in Hyderabad.
(Video and… https://t.co/Cv1cvJKNxM pic.twitter.com/Y1kl0ikrJd
— ANI (@ANI) September 27, 2026