E-Paper
Advertisement

బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!

బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!
Advertisement

Sai Prasad: స్వేచ్చ బ్యూరో: మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారి పి.ఎం. సాయి ప్రసాద్‌ అలియాస్‌ ‘టీమ్‌ సాయి’పై అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్‌ మీడియా కన్వీనర్‌ డి. పద్మిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

ఫిర్యాదులో..

తాను గత కొన్నేళ్లుగా సాయి ప్రసాద్‌, ఆయన బృందంతో కలిసి పనిచేశానని, ఈ ఏడాది ఏప్రిల్‌ 1న వారి నుంచి విడిపోయినట్లు పద్మిని తెలిపారు. అయితే అప్పటి నుంచి సాయి ప్రసాద్‌ తనను పదేపదే భయపెట్టడం, వేధించడం, బెదిరించడం చేశారని ఆరోపించారు. తనను కులపరంగా, లైంగికంగా అసభ్య పదజాలంతో దూషించారని, భర్త, పిల్లలకు తీవ్ర హాని కలిగిస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇష్టం లేకపోయినా తనతో సంభాషణ కొనసాగించేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

Advertisement

Also read: స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

వేర్వేరు సందర్భాల్లో వేధింపులు

2024 డిసెంబరు 24, 2025 ఏప్రిల్‌ 1, ఆగస్టు 9 తేదీల్లో వేర్వేరు సమయాల్లో తాను సాయి ప్రసాద్‌ నివాసంలో ఉన్నప్పుడు తనపై ఒత్తిడి తెచ్చినట్లు పద్మిని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడిన ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

Also read: ఐదు రోజలు ఉండాల్సిందే.. తేల్చి చెప్పేసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

Tags

Related News

తెలంగాణలో బీజేపీ దూకుడు.. వరుసగా 3 రోజులు అగ్రనేతల టూర్లు, షెడ్యూల్ ఇదే!

రేవంత్‌పై విమర్శల ఎఫెక్ట్.. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఫోన్ కాల్.. 23న కీలక భేటీ!

స్క్రిప్ట్ బీఆర్ఎస్‌ది.. ప్రజెంటేషన్ బీజేపీది.. కిషన్ రెడ్డిపై చామల ఫైర్

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువైంది.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ ఫోకస్!

బిర్యానీ ప్రియులకు షాక్.. మాదాపూర్ బావర్చి, మెహఫిల్ సహా పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా!

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటింటికీ రూ.300లకే టీ-ఫైబర్ ఇంటర్‌నెట్!

తెలంగాణ పట్టణాలకు మహర్దశ.. రూ.20 వేల కోట్లతో సీఎం రేవంత్ భారీ ప్లాన్!

హైదరాబాద్‌ సిటీలో ఆ ప్రాంతాలకు బిగ్ అలర్ట్.. రాత్రి నుండి 24 గంటలు నీటి సరఫరా బంద్

Big Stories

Advertisement
×