BigTV English

Lady Aghori: స్మశానవాటికలో అఘోరీ.. దీపాలతో పూజలు.. అక్కడంతా భయం భయం..

Lady Aghori: స్మశానవాటికలో అఘోరీ.. దీపాలతో పూజలు.. అక్కడంతా భయం భయం..

Lady Aghori: అది ఒక స్మశానవాటిక. చీకటి పడింది. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఓ నీడ కనిపిస్తోంది. ఆ వైపున వెళుతున్న ఓ వ్యక్తి, ఆ నీడను గమనించాడు. ఇంకేముంది గజగజ వణికిపోయాడు. స్థానికులకు అసలు విషయాన్ని తెలిపి, అక్కడికి వచ్చి ఒకే ఒక్క లుక్ వేశారు. అంతే హడలెత్తిపోయారు. ఇంతకు అక్కడ ఉన్నది ఎవరో తెలుసా లేడీ అఘోరీ మాత.


తెలంగాణకు చెందిన అఘోరీ మాత తెలియని వారు ఉంటారా.. అస్సలు ఉండరు కూడా. ఎందుకో తెలుసా ఈమె క్రేజ్ అటువంటిది. అతి తక్కువ కాలంలో సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం పొందిన అఘోరీ మాత, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారారు.

మొన్నటి వరకు ఏపీలో హల్చల్ చేసిన అఘోరీ మాత ఉన్నట్లుండి మంగళవారం నకరికల్లులో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆమెకు కాసేపు వాగ్వాదం సాగింది. అంతకు ముందు ఏపీలోని మంగళగిరి, ఇబ్రహీం పట్నం వద్ద అఘోరీ మాత రహదారిపై బైఠాయించిన విషయం తెలిసిందే. అలాగే ఇబ్రహీంపట్నం వద్ద రహదారిపై కారు అడ్డంగా నిలిపి, కారు లోనే పూజలు నిర్వహించగా పోలీసులు, స్థానికులు ఎట్టకేలకు అద్దాలు పగలగొట్టి అఘోరీ మాతను బయటకు తీశారు.


అక్కడి నుండి అఘోరీ మాత నకరికల్లు కు చేరుకోగా, అక్కడి నుండి పోలీసులు పంపించి వేశారు. అయితే ఉన్నట్లుండి మంగళవారం సాయంత్రం అఘోరీ మాత వరంగల్ లోని బెస్తం చెరువు స్మశాన వాటికలో ప్రత్యక్షమయ్యారు. ఆ స్మశాన వాటికలో పూజలు నిర్వహిస్తుండగా, స్థానికులు గమనించారు. శరీరానికి బూడిద పూసుకొని, ఆరిపోయిన చితిపై పడుకున్న అఘోరీ మాతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Also Read: CM Revanth Reddy: ప్రపంచం చూపు వరంగల్ వైపు.. ప్రాణం ఉన్నంత వరకు మీవాడినే.. సీఎం రేవంత్ రెడ్డి

స్మశాన వాటికలో అఘోరీ మాత ఉన్నట్లు సమాచారం అందుకున్న స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇంతకు అఘోరీ మాత స్మశాన వాటికలో ఏ పూజలు నిర్వహించారో కానీ, చుట్టూ దీపాలను వెలిగించి స్మశాన వాటికలో ఆమె హల్చల్ చేశారు. పలువురు మాత్రం అసలు స్మశాన వాటికలో అఘోరీని చూసి గజగజ వణికి పోయారట.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×