E-Paper
Advertisement

పోలీసుల అదుపులో లింగమనేని సంజూష్? ప్రమాదం వెనుక అసలు కారణాలు ఇవిగో

పోలీసుల అదుపులో లింగమనేని సంజూష్? ప్రమాదం వెనుక అసలు కారణాలు ఇవిగో
Advertisement

Hyderabad: జనసేన ఎంపీ లింగమ నేని రమేష్ కుమారుడు సంజయ్ కారు రోడ్డు ప్రమాదంపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాదాపూర్‌లో ఇన్‌ఆర్బిట్ మాల్‌ వద్ద ఎదురుగా రోడ్డు క్రాస్ చేస్తున్న యువతిని కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.  లింగమనేని సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో తప్పు ఎవరిది? కారు అతి వేగం ప్రమాదానికి దారి తీసిందా? మరేదైనా కారణముందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది?

ఆగస్టు 16న ఏం జరిగింది? ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే కారుని జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజూస్ నడుపుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు కొన్ని విషయాలు స్వయంగా వెల్లడించాడు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరగలేదని, దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యతగా భారతి అనే యువతిని తాను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపాడు. ఈ ఘటన గురించి తాను స్వయంగా పోలీసుస్టేషన్‌కు వెళ్లినట్టు వివరణ ఇచ్చాడు. స్టేషన్‌లో ఘటనకు సంబంధించి ప్రమాదం వివరాలు తెలియజేశానన్నాడు. పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టు, యూరిన్, బ్లెడ్ టెస్టులు చేశారని, అన్ని పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చాయన్నాడు.

Advertisement

 

నిందితుడు మాటలు ఈ విధంగా..

పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించాడు. అలాగే బాధితురాలి కుటుంబాలనికి తన వంతు సహాయం చేస్తానని వివరించాడు. ఘటనకు సంబంధించిన అన్ని వాస్తవాలను పోలీసులు పరిశీలించి, ప్రమాదానికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. భారతి మృతిపై నిందితుడు లింగమేనని సంజూష్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొన్నాడు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు.

Advertisement

 

ఆ సెక్షన్ కింద గరిష్టంగా ఐదేళ్లు జైలు తప్పదా?

ఇంకా కేసు లోతుల్లోకి వెళ్తే.. ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. ఆ సమయంలో ITC కోహినూర్‌ సమీపంలో రోడ్డు దాటుతోంది మాదాపూర్‌లో ఇనార్బిట్‌ మాల్‌ ఉద్యోగిని 26 ఏళ్ల భారతి ముఖి. Aston Martin (TG-09-G-0666) కారు నడుపుతున్న లింగమనేని సంజుష్‌ వాహనం..  సదరు యువతిని ఢీ కొట్టింది. యువతి అక్కడికక్కడే చనిపోయింది. అయితే సంజుష్‌ కారు వేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మాదాపూర్‌ పోలీసులు BNS 106- 1 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌ కింద అయితే గరిష్టంగా ఐదేళ్లు జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. సంజూష్ నడుపుతున్న కారు Honor Prime Housing LLP పేరుతో రిజిస్టర్‌ అయి ఉంది. ఆంధ్ర-తెలంగాణలో పని చేస్తున్న ఓ బడా కాంట్రాక్టర్ ఒత్తిడి వల్ల లింగమనేని సంజుష్‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ALSO READ: ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Related News

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!

కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!

కేటీఆర్‌కు మతిస్థిమితం లేదు.. ఎర్రగడ్డకు పంపాల్సిందే!- గజ్జెల కాంతం

బీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్.. వచ్చే ఎన్నికల్లో 40 మందికి టికెట్లు కట్? వెనుక ఏం జరిగింది?

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

ఖైరతాబాద్‌పై కన్నేసిన తలసాని.. బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్ ఎదురైందా?

Big Stories

Advertisement
×