E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు చుక్కలు చూపించిన రాజు      

Brahmamudi Serial Today Episode August 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు చుక్కలు చూపించిన రాజు      
Advertisement

Brahmamudi serial today Episode: రేఖ వెంట్రుకతో డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించిన రాజు. డీఎన్‌ఏ రిపోర్టులో లక్కీ, రేఖ కొడుకే అని మ్యాచ్‌ అవుతుంది. ఆ రిపోర్ట్‌ చూస్తుంటే.. ఇందు వచ్చి అడుగుతుంది. ఇందుకు అన్ని విషయాలు చెప్పి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర భోజనం చేస్తున్న భూషణ్‌ కు పక్కనే రిపోర్ట్‌ పెట్టి ఇందును పైకి వెళ్లమని చెప్పి రాజు రేఖ దగ్గరకు వెళ్తాడు.

పైన రేఖ సంతోషంగా లక్కీగాడిని అడ్డుపెట్టుకుని నన్నే బ్లాక్‌ మెయిల్‌ చేస్తావా రాజు.. ఇక ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు అని హ్యాపీగా ఫీలవుతుంది. రాజు దగ్గరకు వెళ్లి ఏదో సంతోషంగా ఉన్నట్టు ఉన్నావు.. పర్వాలేదులే ఇంకాసేపట్లో నీ  సంతోషం ఆవిరై పోతుందిలే అనగానే.. విషయం ఏంటో చెప్పు అంటూ సీరియస్‌గా చూస్తుంది రేఖ.. రాజు నవ్వుతూ నీకొక స్వీట్‌ న్యూస్‌ చెబుదామని వచ్చాను పిన్ని సారీ సారీ అది నీకు బ్యాడ్ న్యూసేలే.. ఈరోజు నీ గతం బ్లాస్ట్‌ అయిపోతుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్లందరికీ మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది. ఎవరెవరో ఎలా రియాక్ట్‌ అవుతారో కూడా తెలియదు.. నిజంగా లక్కీ నీ కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. నువ్వు సాక్ష్యాధారాలు లేవని రాత్రి తెగ ఇదైపోయావు కదా..? అందుకని సాక్ష్యం సంపాదించాను..

Advertisement

నేనేం పీకలేనని వెంట్రుక పీకి నా మీద వేశావు కదా..? ఇప్పుడు ఈ వెంట్రుకే సాక్ష్యం అయింది. ఇదిగో ఈ నీ వెంట్రుకతో నేను డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించాను.. నీది, లక్కీది డీఎన్‌ఏ మ్యాచ్‌ అయింది. బుద్దిగా నా మాట విని అందరి ముందు నువ్వే నిజం చెబితే బాగుండేది కదా..? డీఎన్‌ఏ రిపోర్ట్‌ కింద డైనింగ్‌ టేబుల్‌ దగ్గర నీ భర్త భూషణ్‌ బాబాయ్‌ టిఫిన్‌ చేస్తున్నాడు కదా అక్కడ పెట్టాను రిపోర్ట్‌ అంటూ చెప్పగానే.. రేఖ కంగారు పడుతుంది. బాల్కనీలోకి వెళ్లి చూస్తుంది. నిజంగానే భూషణ్‌ టిఫిన్‌ చేస్తుంటాడు.. వెంటనే రేఖ కిందకు పరుగెడుతుంది. అప్పుడే తినడం ఆయిపోయిన భూషణ్ పక్కనే ఉన్న కవర్‌ తీసుకుంటాడు. ఓపెన్‌ చేసి చూసి షాకింగ్‌ గా గట్టిగా రేఖ అని పిలుస్తాడు. రేఖ భయంతో భూషణ్‌కు నిజం తెలిసిపోయింది ఇప్పుడెలా అనుకుంటూ నిలబడిపోతుంది. దగ్గరకు వెళ్లిన భూషణ్‌ ఈ నిజం నాకెందుకు చెప్పలేదు రేఖ.. ఈ రిపోర్ట్‌ నువ్వు చూశావా..? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే.. రేఖ భయంగా మౌనంగా ఉండిపోతుంది. అయినా బ్లడ్‌ రిపోర్ట్‌ నాకెందకు చెప్పలేదు అంటాడు భూషణ్‌.. ఆశ్చర్యంగా బ్లడ్‌ రిపోర్టా..? అంటుంది రేఖ. అవునని చూడు అంటూ రేఖకు ఇస్తాడు..

రేఖ ఆ రిపోర్ట్‌  చూసి షాక్‌ అవుతుంది. పైనుంచి చూస్తన్న రాజు నవ్వుతుంటాడు. భూషణ్‌ వెళ్లిపోయాక రాజు కిందకు వచ్చి ఏంటి పిన్ని రిలాక్స్‌ అయిపోయావు.. భూషణ్‌ బాబాయ్‌ చూడలేదని సంబరపడిపోతున్నావా..? ఇక్కడ బ్లడ్‌ రిపోర్ట్‌ ఉందంటే డీఎన్‌ఏ రిపోర్ట్‌ ఎక్కడు పెట్టానబ్బా.. ఆ గుర్తుకు వచ్చింది నీ ముద్దుల మేనకోడులు ఐశ్వర్య రూంలో పెట్టాను త్వరగా వెళ్లు పిన్ని లేదంటే ఐశ్వర్య చూసేస్తుంది అని చెప్పగానే.. రేఖ పరుగుపరుగున ఐశ్వర్య రూంలోకి వెళ్తుంది. ఐశ్వర్య ఏదో పేపర్‌ చూస్తుంది. రేఖ దగ్గరకు వెళ్లి నిజం తెలిసిపోయిందా..? అని అడిగితే తెలిసిపోయింది. అసలు ఏంటి అంటీ ఇది ఇంత మోసం ఎవ్వరైనా చేస్తారా..? అంటుంది. నాకేం కావాలో అవన్నీ ఈ పేపర్‌లో రాసుకున్నాను అని ఐశ్వర్య చెప్పగానే.. అవి ఇవి రిపోర్ట్స్‌ కావా..? అంటే కావని చెప్తుంది. రేఖ కోపంగా కిందకు వెళ్లి రాజును తిడుతుంది. డీఎన్‌ఏ రిపోర్ట్‌ లేదు ఏమీ లేదు నన్ను భయపెట్టడానికి ఇలా చెప్తున్నావు.. అనగానే.. ఏం లేదు పిన్ని అక్కడ లేవా..? అయితే మా రూంలోనే పెట్టి ఉంటాను.. ఇప్పుడు కానీ ఇందు చూసిందంటే.. తన ద్వారా నిజం బయటపడిపోతుంది. అని చెప్పగానే.. రేఖ మళ్లీ ఇందు రూంలోకి పరుగెడుతుంది.

Advertisement

రూంలోకి వెళ్లగానే.. ఇందు ఏవో పేపర్స్‌ చూస్తూ ఉంటుంది. అవి చూశావా..? అని అడిగితే చూశానని ఇందు చెబితే అందులో ఉన్న నిజం ఎవ్వరికీ చెప్పొద్దు ఇందు ఫ్లీజ్‌ అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. ఇందు ఆంటీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ఆ రిపోర్ట్‌ ఎవరివి అని రేఖ అడిగితే.. తాతయ్యవి అని చెప్తుంది. రేఖ సరే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజు తిడుతూ.. రిపోర్ట్‌ అంటూ నాతో ఆటలు ఆడుకుంటున్నావా..? అనగానే.. ఎక్కడో పెట్టాను పిన్ని మర్చిపోయాను.. ఆ గుర్తుకు వచ్చింది అంటూ భ్రమరాంబ దగ్గర ఉన్నాయి అని చెప్తాడు. భ్రమరాంబ కోసం బయటకు పరుగెడుతుంది రేఖ. అటూ ఇటూ చూస్తుంది. అప్పుడే ఏవో పేపర్స్‌ పట్టుకుని గేటులోంచి లోపలికి వస్తుంది. గుమ్మంలో నిలబడిన రేఖను కోపంగా చూస్తుంది. రేఖ దగ్గరకు పరుగెడుతుంది. భ్రమరాంబ కోపంగా రేఖ ఏంటి ఇది.. నేను నిన్ను ఎంత నమ్మాను.. నన్నే మోసం చేశావా..? తప్పు చేసిన వాళ్లను శిక్షించాలా వద్దా..? ఈ విషయం అందరికీ తెలియాలి పద వెళ్దాం అంటూ చెప్పగానే.. రేఖ వద్దు వదిన వద్దు అంటూ ఆపేస్తుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్..అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఊహించని సీన్..

Karthika Deepam 2 Serial Today Episode August 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు షాక్ ఇచ్చిన సూరజ్       

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..

‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టాడా..?

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు సినిమాల జాతర.. టీవీల్లోకి హిట్ మూవీస్…

మై విలేజ్ షో అసలు నిజాలు బయటపెట్టిన అంజి మామ.. శ్రీకాంత్ మోసం చేశాడా?

ఈశ్వర్ సాయి-మాధురి వ్యవహారంపై భార్య ఫస్ట్ టైమ్ ఓపెన్.. అసలు కథ ఇదే!

Big Stories

Advertisement
×