E-Paper
Advertisement

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!
Advertisement

Horticulture Department: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో విస్తరిస్తున్న ఉద్యాన రంగానికి అనుగుణంగా ఉద్యాన శాఖను బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శాఖలో సమగ్ర క్యాడర్‌ రివ్యూ నిర్వహించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఉద్యాన శిక్షణా సంస్థలో ఆదివారం తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.

ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ..

Advertisement

వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సవాళ్ల నేపథ్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడి, ఆదాయం వచ్చే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరంపై చర్చించారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యాన రంగం విస్తరిస్తున్నప్పటికీ దానికి అనుగుణంగా శాఖలో క్షేత్రస్థాయి మానవ వనరులు పెరగలేదని తెలిపారు. దీంతో రైతులకు సాంకేతిక సలహాలు, పథకాల అమలు, పంటల పరిశీలన, ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ తదితర సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒక్కో ఉద్యాన అధికారి 5 నుంచి 10కుపైగా మండలాల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. ప్రతి మండలానికి కనీసం ఒక హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి, ప్రతి 2–3 మండలాలకు ఒక హార్టికల్చర్‌ అధికారిని నియమించాలని కోరారు.

20 ఏళ్లుగా ఒక్కటే హోదా..

Advertisement

హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యాన శాఖలో పలువురు అధికారులు 20–25 ఏళ్లుగా ఒకే హోదాలో పనిచేస్తున్నారని తెలిపారు. అర్హత కలిగిన వారికి నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించి, ఖాళీగా ఉన్న ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేయాలని కోరారు. భవిష్యత్తులో అధికారులు దీర్ఘకాలం ఒకే హోదాలో కొనసాగకుండా స్పష్టమైన కెరీర్‌ ప్రోగ్రెషన్‌ విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో అవసరమైన కార్యాలయాలు, పరిపాలనా, సాంకేతిక, సహాయక సిబ్బందిని మంజూరు చేయాలని కోరారు.

తక్కువ నీటితో అధిక దిగుబడి..

క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం రైతుల పొలాలను సందర్శిస్తూ విధులు నిర్వహిస్తున్నందున వారికి టీఏ, కన్వేయన్స్‌ సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. పంటల వైవిధ్యీకరణ, కూరగాయల ఉత్పత్తి పెంపు, నీటి వినియోగం తగ్గింపు, అధిక విలువ కలిగిన పంటల సాగు విస్తరణ, రైతుల ఆదాయం పెంపు వంటి లక్ష్యాల సాధనకు బలమైన ఉద్యాన శాఖ ఎక్స్‌టెన్షన్‌ వ్యవస్థ అవసరమని అన్నారు. ఈ సమావేశంలో టీజీఓ హార్టికల్చర్‌ ఫోరం కార్యదర్శి రోహిత్‌,టీజీఓ జనరల్ సెక్రటరీ శ్యాం, అసోసియేట్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య, హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎంబీ క్రిష్ణయాదవ్, రంగారెడ్డి ప్రెసిడెంట్ రామారావు, హార్టికల్చర్ అఫీసర్స్ అసోసియేషన్ నాయకులు నిరంజన్ రెడ్డి, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

Also Read: జగన్ రాజకీయ భవిష్యత్తు కటకటాలే.. వివేకా హత్య కేసుపై మంత్రి మండిపల్లి ధ్వజం

Tags

Related News

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!

కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!

కేటీఆర్‌కు మతిస్థిమితం లేదు.. ఎర్రగడ్డకు పంపాల్సిందే!- గజ్జెల కాంతం

బీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్.. వచ్చే ఎన్నికల్లో 40 మందికి టికెట్లు కట్? వెనుక ఏం జరిగింది?

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

ఖైరతాబాద్‌పై కన్నేసిన తలసాని.. బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్ ఎదురైందా?

Big Stories

Advertisement
×