E-Paper
Advertisement

ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతోపాటు పిడుగులు కూడా

ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతోపాటు పిడుగులు కూడా
Advertisement

Rain Alert: ఎల్ నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై స్పష్టంగా పడింది. వానలు లేక సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. శుక్రవారం ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. వాన కబురు తెలియగానే ఊపిరిపీల్చుకుంటున్నారు రైతులు.

 

ఏపీలోకి వర్ష సూచన

Advertisement

వానలు లేక అల్లాడిపోతున్నారు సగటు సామాన్యులు. పగలు-రాత్రివేళ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు సామాన్యులు. దీనికితోడు ఎల్ నినో కూడా తోడుకావడంతో వాతావరణ కాసింత చల్లగా ఉంటుందికానీ, వర్షాలు మాత్రం పడడం లేదు. ఇక రైతుల గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.

 

ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

Advertisement

శుక్రవారం పలు జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే తూర్పు-పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి చెబుతోంది. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశముందని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

వర్షాల సమయంలో పిడుగులు కూడా పడే ఛాన్స్

కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ విషయాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. జూన్‌లో నైరుతి పవనాలు ప్రవేశించాయి, ఆ సమయంలో తేలికపాటి వర్షాలు కురిసాయి. ఆ తర్వాత భారీ వర్షాలు పడిన సందర్భం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడినా వాతావరణ చల్లగా మాత్రమే ఉంటుంది.

ALSO READ: మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనసేన ఎంపీ కొడుకు కారు ఢీకొని యువతి మృతి!

రాష్ట్రంలో సరైన వర్షాలు పడక రైతుల్లో ఆందోళన మొదలైంది. చాలావరకు పంటలు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పాలేరు-20 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ- 16.8, గుంటూరు జిల్లా తెనాలి-16.4, కర్నూలు జిల్లా దేవనకొండ-13.8, అన్నమయ్య జిల్లా రాజంపేట-10.8, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు-10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు తెలిపింది.

Related News

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్, రూ. 40 కోట్ల సుపారీకి సమాధానం చెప్పాలి

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

Big Stories

Advertisement
×