Hydeabad: బీఆర్ఎస్ నేతలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా? వచ్చే ఎన్నికల్లో టికెట్లు కష్టమనే సంకేతాలు ఆ పార్టీలోని కొందరు నేతల చెవిలో పడిందా? పార్టీ హైకమాండ్ అందుకోసం తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టిందా? ఇంతకీ టికెట్లు రాని ఆ 40 మంది నేతలు ఎవరు? ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీలో నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
తెలంగాణలో ఎన్నికలకు కేవలం రెండేళ్లు ఉంది. ఇప్పటి నుంచి టికెట్లు ఎంపిక ప్రయత్నాలు ఆ పార్టీ మొదలుపెట్టింది. మరో నాలుగైదు నెలల్లో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో ఆయన.. తన సన్నిహితుల వద్ద కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇంతకీ సన్నిహితుల వద్ద కేటీఆర్ ఏమన్నారు?
వచ్చే ఎన్నికల్లో 30 నుంచి 40 మంది నేతలకు టికెట్లు తిరస్కరిస్తున్నట్లు అందులో తొలిపాయింట్. గతంలో కూడా అభ్యర్థులను మార్చకుండా ఇవ్వడం వల్లే తాము ఓడిపోయామని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకురావాలని ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికలకు 6 నెలల ముందు అభ్యర్థుల్ని ప్రకటిస్తామని సంకేతాలు ఇచ్చారట.
ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 119 నుంచి 186కు పెరిగితే తాము ఖచ్చితంగా 130 సీట్లు గెలుస్తామని మనసులోని మాట బయటపెట్టారట. అంతేకాదు తెలంగాణలో సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారట. కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉంటారని, నేను పాదయాత్ర చేస్తారని, కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారని చెప్పుకొచ్చారట. నేను పాదయాత్ర చేస్తే మా పార్టీకి అదొక గేమ్ చేంజర్ అవుతుందని, యాత్రలో అన్నివర్గాల ప్రజలను కలుస్తానని చెప్పారట.
అంతేకాదు కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తానని బయట పెట్టారట. ఇప్పటికే పలుమార్లు సర్వే చేయించారని, ప్రజలతో నిత్యం అందుబాటులో ఉన్న నేతలకు ఇవ్వాలని ఓ జాబితా రెడీ అయినట్టు అందులోని అసలు సారాంశం. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూనే, నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రజలకు పరిచయం చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కేటీఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పిన మాటలు బయటకు రాగానే ఆ పార్టీలోని నేతలకు టెన్షన్ మొదలైంది.
ALSO READ: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్ మార్పులు మీకోసమే!
అధికారం లేకపోయినా తాము పోరాటం చేస్తున్నామని, ఇలాంటి సమయంలో కీలక నేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని చర్చించుకుంటు న్నారు. ఏయే నేతలను దూరంగా పెడుతుందనే ఆసక్తికరంగా మారింది. ఆ లెక్కన జిల్లాలకు ఒకరు లేదా ఇద్దరు నేతలను తప్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.