Big Shock to BRS: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏకంగా ఓ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. పార్టీలో చేరిన వారికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం సకినవీడు గ్రామంలో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ పర్యటనలు ఎర్రుపాలెం మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సాదరంగా స్వాగతం పలికిన భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు మద్దతుగా బీఆర్ఎస్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రుచి చూపిస్తుందన్నారు.
ప్రజలు చెల్లించిన పన్నులతోనే పాలన సాగుతుందని, వారిచ్చిన డబ్బులను వారి సంక్షేమానికి ఉపయోగించడం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమైందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగుతుందని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడడంలో తమ మంత్రివర్గంలోని ఏ ఒక్క మంత్రి కూడా వెనుకాడడం లేదంటూ భట్టి విక్రమార్క అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండడం, ప్రజా సమస్యలను పరిష్కరించడమే పరమావధిగా తమ రోజువారి దినచర్య సాగుతుందని తెలిపారు.
Also Read: Adilabad Road Accident: కాసేపట్లో ఆలయానికి.. అంతలోనే ప్రమాదం.. 40 మంది భక్తులకు తీవ్ర గాయాలు
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, మెప్పుకోసం పాకులాడే వ్యక్తిత్వం తనది కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటున్నారని, జనవరి 26వ తేదీన బృహత్తర పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మధిర నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు, మధుర నియోజకవర్గం రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు పొందేలా చేయడం తన ముందును లక్ష్యమంటూ బట్టి విక్రమార్క అన్నారు. అయితే మండలం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని, ఇదే పురంపర రానున్న రోజుల్లో కొనసాగుతుందంటూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.