Mancherial Road Accident: మంచిర్యాల జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నస్పూర్ వద్ద వేగంగా వస్తున్న లారీ, ఆటోను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
షాపింగ్ మాల్‌కి వెళ్తుండగా ప్రమాదం
మందమర్రి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన సౌందర్య, రవ్య, రవళి మంచిర్యాల పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నారు. రోజూలాగే ఉదయం విధుల్లోకి వెళ్లేందుకు ఆటోలో బయల్దేరారు. మార్గమధ్యంలో నస్పూర్ వద్దకు రాగానే అకస్మాత్తుగా ఆటోకు ఒక బైక్ అడ్డంగా వచ్చింది.
తప్పించబోయి లారీ కిందకు..
బైక్‌ను తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ వాహనాన్ని పక్కకు తిప్పగా, ఎదురుగా వస్తున్న లారీని ఆటో బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జయింది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానికులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: గద్వాల జిల్లాలో విద్యార్థుల బస్సు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం!