Gadwal Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ రహదారి (NH-44) పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని సేలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని బోరవెల్లి సమీపానికి రాగానే అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
బస్సులో 37 మంది విద్యార్థులు..
ఈ బస్సులో విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న 37 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు బోల్తా పడటంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థులంతా స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి విద్యార్థులను బయటకు తీశారు.
కేసు నమోదు..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: హోంగార్డుల విషయంలో సాయిరెడ్డి సంచలన పోస్ట్.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు బిగ్ అలర్ట్!