E-Paper
Advertisement

MP Raghunandan Rao: ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..?

MP Raghunandan Rao: ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..?
Advertisement

MP Raghunandan Rao: గజ్వేల్ స్వేచ్ఛ: స్వార్థ ప్రతిపక్ష రాజకీయ నాయకులకు కేంద్ర బడ్జెట్ వాస్తవాలు కనిపించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల బడ్జెట్ పై ఆరోపణలు పసలేనివని పేర్కొన్నారు. గజ్వేల్ లో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం మాట్లాడారు. కేటీఆర్, హరీష్, కవిత లు ఇష్టం వచ్చినట్లు బడ్జెట్ పై మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. రైల్వే బడ్జెట్ లో గతంలో కన్నా రైళ్లకు 15 శాతం, రోడ్లకు 10 శాతం కేటాయింపుల పెంపు జరిగిందన్నారు. బట్టి రాష్ట్రానికి ఏమొచ్చిందని అనడంలో వాస్తవం లేదని గతంలో కన్నా రూ 1300 కోట్లు డివల్యూషన్ ఫండ్ ఎక్కువ చేయడం జరిగిందని వివరించారు. అన్ని రాష్ట్రాల సమ్మిలిత అభివృద్ధి కోసం మోడీ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని వివరించారు.

సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్..

దక్షిణ భారతదేశానికి 7 హై స్పీడ్ రైలు వస్తే హైదరాబాదు కేంద్రంగానే 3 రైళ్లను కేటాయించడం జరిగిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. పదేళ్లు పాలనలో బిఆర్ఎస్ కు సోయరాలేదని, రెండేళ్ల పాలనలో ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళకు సోయి లేకుండా పోయిందని రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రంపై మాట్లాడడం కాకుండా రాష్ట్రంలో తాము చేసిందేందో చెప్పాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నియోజకవర్గం ఆర్థిక స్థితిగతుల్లో ఏలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. 119 నియోజకవర్గాల సమాన అభివృద్ధికి బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టుబడి పని చేశాయా అన్నది ప్రజల ముందు చెప్పాలన్నారు. గజ్వేల్ కు పాతాయన పాలనలో “గాడా” పెడితే, కొత్తయన పాలనలోకి వచ్చినాక కొడంగల్ కు “కూడా” పెట్టాడు తప్ప మిగతా నియోజకవర్గాల సమస్యలపై పట్టించుకున్న వారే లేరని ఆరోపించారు.

Advertisement

Also Read: Revanth Reddy: వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్లు.. ఉద్యమకారులు, జాతిపితలా.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

బిజెపికి ఒక అవకాశం ఇవ్వండి

రాష్ట్రంలో బిజెపికి ఒక అవకాశం ఇచ్చి చూడండి అని ప్రజలను రఘునందన్ రావు కోరారు. స్థానిక సంస్థల్లో గెలుపు సాధిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. గజ్వేల్ మున్సిపల్ వార్డులలో బిజెపి అభ్యర్థులంతా యువతరమేనని సమస్యల పరిష్కారం కోసం దగ్గరుండి చూసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సిద్దిపేట బిజెపి జిల్లా అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, బిజెపి నాయకులు గాడి పల్లి కళ్యాణి భాస్కర్, మనోహర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Maruti Suzuki Price Hike: కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్, ధరల పెంపు తప్పదా?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×